Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- News
కోవిడ్ వ్యాక్సిన్ అప్డేట్: ధర, రిజిస్ట్రేషన్, సైడ్ ఎఫెక్ట్స్ - అన్ని ప్రశ్నలకు సమాధానాలు
- Movies
మరణం తర్వాత కూడా తీరని వివేక్ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి
కార్లు ప్రజలకు ప్రస్తుతం తప్పనిసరి నిత్యావసరంగా మారాయి. కావున కార్లు ఉపయోగించే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కార్లను ఉపయోగించే ప్రజలు కారుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది వాహనదారులు కారులోనే ఆహారపదార్థాలు మొదలైనవి విడిచిపెడుతున్నారు. ఇవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. కారులో ఆహారపదార్థాలను వదిలివేయడం వల్ల వచ్చే సమస్యల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కారులో దుర్వాసన రావడం:
ఆహారాన్ని చాలా రోజులు కారులో వదిలేస్తే అది కుళ్ళిపోయి వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ వాసన కారణంగా వివిధ జంతువులు కారులోకి ప్రవేశిస్తాయి. ఇది కారును దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఈ వాసన వారాలపాటు బయటికి పోదు. ఈ వాసన ప్రయాణికులకు చాలా ఇబ్బంది కల్గిస్తుంది. ఈ వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా కారులోని దుర్వాసనను తొలగిస్తుంది.

బాక్టీరియల్ వ్యాప్తి:
కారు ఎండలో నిలిచినప్పుడు, కారు లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియా పెరగడానికి వేడి మరియు తేమ అవసరం. ఈ కారణంగా కారులో ఆహారం ఉండకూడదు. మీరు డ్రైవ్ చేసే కారులో ఎటువంటి వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే బ్యాక్తీరియా వ్యాప్తి తగ్గుతుంది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

ఫుడ్ పాయిజనింగ్:
ఫుడ్ పాయిజనింగ్, బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపించడం వల్ల వస్తుంది. బ్యాక్టీరియా ఆహారం నుండి వ్యాప్తి చెందుతుంది మరియు ఒక వ్యక్తి ఆ ఆహార పదార్థాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడే అవకాశం ఉంది. చేపలు మరియు మాంసం వంటి జంతు ఉత్పత్తులు ఫుడ్ పాయిజనింగ్ కి కారణం అవుతాయి.

ఎలుకలు:
కారుకి ప్రధాన శత్రువులు ఎలుకలు. అవి కారులోకి ప్రవేశిస్తే కారులోని వైర్లు వంటివి కత్తిరిస్తాయి. అప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఈ ఎలుకలు కారులోకి ప్రవేశించడానికి ప్రధాన కారణం కారులో ఏదైనా ఆహారపదార్థాలను నిల్వ ఉంచడం. కారులో చొరబడిన ఎలుకలు కారు యొక్క వైర్, అప్హోల్స్టరీ, ఎసి మరియు ఇంజిన్లను పాడు చేసేఅవకాశం ఉంది.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

కారులోని ప్రధాన భాగాలను ఎలుకలు పాడు చేసినట్లయితే, వాటిని తిరిగి రిపేర్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక వేళా ఎలుకలు స్థిరంగా కారులోనే ఉండిపోతే ఆ కారు దాదాపు పనికిరాకుండాపోయే అవకాశం ఉంది.

బాటిల్ ఫైర్:
ఈ శబ్దాన్ని వినడానికి కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కానీ కారు పైన ఉంచిన వాటర్ బాటిల్ కారణంగా కారులో మంటలు చెలరేగిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీరు లెన్స్‌గా పనిచేస్తుంది మరియు సూర్యుడి వేడిని ఒక బిందువుకు కేంద్రీకరిస్తుంది.
MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

ఈ ప్రక్రియ కారు అప్హోల్స్టరీ యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది మరియు కారు కాలిపోయేలా చేస్తుంది. ఈ కారణంగా, నీటితో నిండిన ప్లాస్టిక్ బాటిల్‌ను కారు డాష్‌బోర్డ్‌లో ఎప్పుడూ ఉంచకూడదు. కావున వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పైన పేర్కొన సమస్యల నుంచి బయటపడవచ్చు.