ప్రపంచంలోనే అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

Written By:

పొడవైన రైళ్ల గురించి తెలుసుకునే ముందు, రైళ్ల యొక్క పొడవుకు అవధులేమిటి అనేది తెలుసుకోవాలి. అన్ని రైళ్లకు ఎక్కువ భోగీలను ఏర్పాటు చేయలేరు. విభిన్న సాంకేతిక అంశాలకు లోబడి ఒక రైలు పొడవు ఇంతే ఉండాలి అని నిర్ణయించడం జరిగింది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

సాధారణంగా రైళ్ల పొడవును నిర్ణయించేందుకు దోహదపడే అంశాలు గురించి తెలుసుకుంటే, రైల్వే మార్గం సామర్థ్యం, ఆ మార్గంలోని మలుపుల స్థాయి, మలుపుల సంఖ్య, విద్యుత్ రైళ్లకు పవర్ సరఫరా, రైలింజన్ యొక్క సామర్థ్యం, భూ బాగం, మరియు లాగాల్సిన బరువుల సామర్థ్యం వంటివి ప్రధానంగా ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన టాప్ 10 రైళ్ల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

10. ది ఘాన్ - ఆస్ట్రేలియా

10. ది ఘాన్ - ఆస్ట్రేలియా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన టాప్ 10 రైళ్ల జాబితాలో ఉన్న ఏకైక ప్యాసింజర్ రైలు ది ఘాన్. ఇది ఆస్ట్రేలియాలో కలదు. కంగారూల గడ్డపై ఉన్న అడిలైడ్ మరియు డార్విన్ ప్రాంతాల మధ్య సేవలందిస్తోంది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

ప్రస్తుతం ఇది 16 నుండి 26 భోగీలతో సుమారుగా 2979 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తోంది. అయితే ఈ మాత్రం దానికే టాప్ 10 జాబితాలోకి ఎంపికవుతుందా అంటే, ఒకప్పుడు ఇది 99 భోగీలతో నడిచే విషయాన్ని మీకు గుర్తు చేయాలి. అప్పుడు ఈ రైలు మొత్తం పొడవు ఇంజన్ నుండి చివరి భోగీ వరకు 1200 మీటర్లుగా ఉంది.

09. మారుతి సరుకు రవాణా రైలు - ఇండియా

09. మారుతి సరుకు రవాణా రైలు - ఇండియా

ఇండియన్ రైల్వే సరుకు రవాణా కోసం మారుతి ఫ్రైట్ రైలును 2011 లో ప్రారంభించింది. ఇది బిలాస్‌పూర్ మరియు భూస్వాల్ ప్రాంతాల మధ్య సేవలందిస్తోంది. ఈ రైలు గరిష్టం వేగం గంటకు 50కిలోమీటర్లుగా ఉంది. మారుతి రైలును లాగడానికి ముందు వైపున రెండు, మధ్యలో రెండు ఇంజన్‌లు చెప్పున ఏర్పాటు చేయడం జరిగింది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

మారుతి ఫ్రైట్ రైలు గరిష్టంగా 9,000 నుండి 10,000 టన్నుల బరువును లాగగలదు. ఇందులో మొత్తం 118 భోగీలు కలవు. ముందు వైపు ఇంజన్ నుండి చివరి 118వ భోగీ వరకు ఈ రైలు మొత్తం 1400 మీటర్ల పొడవుని కలిగి ఉండి టాప్ 10 పొడవైన రైళ్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఆగ్నేయాసిలో ఒకటిగా మరియు ఇండియాలో అత్యంత పొడవైన రైలుగా నిలిచింది.

08.రియో టింటో రైల్వే సర్వీసెస్ - ఆస్ట్రేలియా

08.రియో టింటో రైల్వే సర్వీసెస్ - ఆస్ట్రేలియా

రియో టింటో అనే సంస్థ ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద ప్రయివేట్ రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. మెయిన్ లైన్ సిస్టమ్ సహకారంతో ఇది సుమారుగా 15 గనులను కలిగి ఉంది. ఇక్కడ తవ్వకాలలో వచ్చే ఖనిజాన్ని తరలించడానికి ప్రత్యేకించి రైళ్లను ఈ సంస్థ స్వతహాగా తయారు చేసుకుంటుంది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

సుమారుగా 1700 కిలోమీటర్ల మేర ఉన్న గనులలో, 173 లోకోమోటివ్‌లను మరియు 10500 వ్యాగన్లను ఉపయోగించి ఖనిజాన్ని తరలించే వారు. రియో టింటో పెద్ద రైలును సమకూర్చుకుంది. 226 వ్యాగన్లను కలిగిన ఉన్న రైలులో ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 105 టన్నులుగా ఉంది. మొత్తం 30,000 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ రైలు యొక్క పొడవు 2400 మీటర్లుగా ఉంది.

07. మౌరిటానియా ఐరన్ ఓర్ ట్రైన్స్ - మౌరిటానియా

07. మౌరిటానియా ఐరన్ ఓర్ ట్రైన్స్ - మౌరిటానియా

మౌరిటియానియా దేశానికి చెందిన మౌరిటానియా రైల్వేలో భాగంగా ఈ ఐరన్ ఓర్ రైళ్లు ఉన్నాయి. వీటిని ప్రత్యేకించి ఈ దేశంలో ఉన్న జోయురేట్ అనే ప్రాంతం నుండి ఇనుప ఖనిజాన్ని నౌఆధిబౌ అనే ప్రాంతాన్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న 704 కిలోమీటర్ల ట్రాక్‌లో ప్యాసింజర్ రైళ్లు చాలా అరుదుగా నడుస్తాయి.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

సుమారుగా 2,500 మీటర్ల పొడవున్న రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. ఒక్కో రైలుకు సుమారుగా మూడు లేదా నాలుగు వరకు డీజల్-ఎలక్ట్రిక్ ఇఎమ్‌డి ఇంజన్‌లు ఉంటాయి. రైళ్లలోని ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 200 నుండి 210 టన్నులు ఉంటుంది. మొత్తం రైలు ఏకంగా 16 మిలియన్ టన్నుల బరువున్న ఖనిజాన్ని రవాణా చేస్తుంది.

06. దాకిన్ రైల్వే బొగ్గు రైళ్లు - చైనా

06. దాకిన్ రైల్వే బొగ్గు రైళ్లు - చైనా

దాకిన్ రైల్వే ఉత్తర చైనాలోని బొగ్గును సుమారుగా 653 కిలోమీటర్ల పాటు తరలించడానికి ఉపయోగిస్తున్నారు. బీజింగ్ మరియు టియాంజిన్ కు చెందిన స్టాక్ ట్రేడింగ్ కంపెనీల చేత వీటిని నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో 1984 లో సింగల్ లైన్ ట్రాక్‌ను నిర్మించగా. 1992లో డబుల్ లైన్‌గా విస్తరించారు.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

దాకిన్ లైన్‌గా పిలువబడే ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు గరిష్టంగా 20,000 మెట్రిక్ టన్నుల బరువును మోయగలవు. చైనాలో ఎక్కువ బరువులను మోసుకెళ్లే రైళ్లు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. వీటిలో హెచ్ఎక్స్‌డి1 మరియు హెచ్ఎక్స్‌డి2 అనే రైళ్లు అత్యంత శక్తివంతమైనవి. ఇక్కడి రైళ్లు 210 వ్యాగన్లను కలిగి ఉంటూ, 3,200 మీటర్ల పొడవుతో ఉంటాయి.

05. కజారస్ సరుకు రవాణా రైళ్లు - బ్రెజిల్

05. కజారస్ సరుకు రవాణా రైళ్లు - బ్రెజిల్

కజారస్ రైల్ రోడ్డును 892 కిలోమీటర్ల మేర 1982లో బ్రెజిల్ లోని కజారస్ నుండి సావ్ లూయిస్ పోర్ట్‌కు సమీపంలో ఉన్న పొంటా డి మాడీరా వరకు కలదు. ఇప్పటి వరకు ఈ మార్గంలో 120 మిలియన్ టన్నులు ఖనిజం మరియు 3,50,000 మంది ప్రయాణికులను రవాణా చేసారు. బ్రెజిల్‌లో ఎక్కువ సామర్థ్యం ఉన్న రైల్వే మార్గం కూడా ఇదే.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

ఈ రెండు ప్రాంతాల మధ్య వచ్చే ఆదాయం బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో మొత్తం 10756 బోగీలు, 217 రైలింజన్లు సేవలో ఉన్నాయి. ఈ మార్గంలో సగటున ఒక్కో రైలు 330 భోగీలను కలిగి ఉంటుంది. వీటి పొడవు 3300 మీటర్లుగా ఉంది.

04. ఏఏఆర్ స్టాండర్డ్ ఎస్-400 - అమెరికా

04. ఏఏఆర్ స్టాండర్డ్ ఎస్-400 - అమెరికా

అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి సగటున 60 బిలియన్ డాలర్ల వరకు సరకు రవాణా రైళ్లు సంపదను కూడగడుతున్నాయి. ఖనిజాలు మరియు ఇతర సరకు రవాణాలో ఈ రైళ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలా వరకు రైళ్లు ప్రయివేట్ సంస్థలచేత నిర్వహించబడుతున్నాయి. వాటిన్నింటింలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్న వాటిలో ఏఏఆర్ స్టాండర్డ్ ఎస్-400 ఒకటి.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

ఈ రైళ్లలో భద్రత పరంగా భారీగా ఫీచర్లు ఉంటాయి. అందులో ఎయిర్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ న్యూమాటిక్ బ్రేకులు (మలుపుల్లో భోగీలు పట్టాలు తప్పడాన్ని నియంత్రించడానికి) కలవు. ఎస్-400 రైలులో సాధారణంగా 180 భోగీలతో సుమారుగా 3659 మీటర్ల పొడవు ఉంటాయి.

03. ఆర్‌డిపి రైళ్లు - దక్షిణాఫ్రికా

03. ఆర్‌డిపి రైళ్లు - దక్షిణాఫ్రికా

దక్షిణ ఆఫ్రికాలోని సుమారుగా 861కిలోమీటర్ల పొడవున్న మార్గంలో ఆర్‌డి‌పి రైళ్లు సేవలందిస్తున్నాయి. వీటిని ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి ఉపయోగిస్తున్నారు. 1976లో సిషన్ నుండి పోర్డ్ సల్దానా కు ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి ఈ మార్గాన్న నిర్మించారు. ఒకే ట్రాక్ ఉన్న ఈ మార్గంలో రైళ్లు సుమారుగా పది సొరంగాలను దాటుకుంటూ గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

ఈ మార్గంలో ఖనిజ రవాణాకు మినహాయిస్తే ప్యాసింజర్ సేవలకు ఒక్క సర్వీసు కూడా లేదు. ఒక్కో రైలు 210 వ్యాగన్లను కలిగి ఉంటుంది. ఒక్కో వ్యాగన్ యొక్క సామర్థ్యం 80 టన్నుల వరకు ఉంది. ప్రస్తుతం రైళ్లు 342 భోగీలతో 42,000 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న 3,780 మీటర్ల పొడవు గల రైళ్లు ఉన్నాయి.

02. డబుల్ స్టేక్ కంటైనర్ రైళ్లు - కెనడా

02. డబుల్ స్టేక్ కంటైనర్ రైళ్లు - కెనడా

కెనడా జాతీయ రైల్వే శాఖచే ఈ డబుల్ స్టేక్ కంటైనర్ రైళ్లు నిర్వహింపబడుతున్నాయి. గతంలో శక్తివంతమైన రైలింజన్ల ద్వారా 1990ల కాలంలో ఎక్కువ బరువులను మోయగల రైళ్లను నడిపేవారు. అప్పట్లే ఈ రైళ్ల పొడవు 1500మీటర్లుగా ఉండేది. ఇప్పుడు మధ్య మధ్యలో పవర్ యూనిట్ల జోడింపు ద్వారా రైళ్ల పొడవు పెరుగుతూ వచ్చింది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

ప్రస్తుతం కెనడాలోని ఇవే రైళ్లు గరిష్టంగా 18,000 టన్నలు వరకు బరువులను లాగుతున్నాయి. ఒక్కో రైలు 3000, 3700, 4000, 4200 మీటర్ల పొడవులో ఉన్నాయి.

01. బిహెచ్‌పి బిల్లిట్రాన్ ఐరన్ ఓర్ ట్రైన్ - ఆస్ట్రేలియా

01. బిహెచ్‌పి బిల్లిట్రాన్ ఐరన్ ఓర్ ట్రైన్ - ఆస్ట్రేలియా

బిహెచ్‌పి బిల్లిట్రాన్ రైలును మౌంట్ న్యూమ్యాన్ రైల్వే నిర్వహిస్తోంది. దీనిని ప్రత్యేకించి ఇనుప ఖనిజం తరలించడానికి ప్రయివేట్ సంస్థ ఏర్పాటు చేసుకుని వినియోగిస్తోంది. 1969 లో అధికారికంగా సుమారుగా 426 కిలోమీటర్లు గల ప్రెయివేట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

న్యూమ్యాన్ నుండి పోర్ట్ హెడ్‌ల్యాండ్ వరకు సుమారుగా 8 గంటలు పాటు ప్రయాణిస్తుంది. ఈ రైలులో 250 బోగీలతో 2.56 కిలోమీటర్ల పొడవు ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలుగా ఇది మొదటి స్థానంలో ఉండేది.

అత్యంత పొడవైన టాప్ 10 రైళ్లు

అయితే 2001లో 682 భోగీల అనుసంధానంతో 82,000 టన్నుల బరువును మోసుకుంటూ యాండల్ నుండి పోర్ట్ హెడ్‌ల్యాండ్ వరకు ఎనిమిది రైలింజన్ల సహాయంతో ఒకే ఒక్క సారి నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది.

 
English summary
Top 10 Longest Trains in the World
Please Wait while comments are loading...

Latest Photos