Just In
- 16 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ కార్లు ఎంతో పాపులర్, అసలు ఇవున్నాయని మీకు తెలుసా?
ఆటోమోటివ్ బ్రాండ్లు తయారు చేసిన కొన్ని విశిష్టమైన కార్లు కొద్దికాలంలోనే చాలా ప్రాచుర్యాన్ని పొందుతాయి. అయితే, కొన్ని కారణాల వలన అవి మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోతాయి. అలాంటి ఓ టాప్-5 కార్ల జాబితాను ఈ కథనంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఈ జాబితాలో ఎస్‌యూవీలు, పెర్ఫార్మెన్స్ ఆధారిత సూపర్ కార్లు మరియు ప్రీమియం హై-ఎండ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. అసలు వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు ఆయా బ్రాండ్‌లు ఇలా విచిత్రంగా కనిపించే ఇలాంటి కార్లను తయారు చేశాయంటే నమ్మటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబల్
ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండి పుట్టుకొచ్చిన ఈ ఎంట్రీ లెవల్ కార్ రేంజ్ రోవర్. అతి తక్కువ ధరతో, కాంపాక్ట్ డిజైన్‌తో ఈ మోడల్ అనతి కాలంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం రేంజ్ రోవర్ ఎవోక్ ఈ బ్రాండ్ యొక్క లైనప్‌లో ఒక ప్రముఖ మోడల్‌గా మారింది. స్వంత మార్కెట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ల్యాండ్ రోవర్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో మరియు విలాసవంతమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంది.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

అయితే, ఒక దశలో ల్యాండ్ రోవర్ తమ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ పైకప్పును (రూఫ్)ని తొలగించి, ఇందులో ఓ కన్వర్టిబల్ వెర్షన్‌ను తయారు చేసింది. వాస్తవానికి స్పోర్ట్స్ కార్లలో కన్వర్టిబల్ వెర్షన్ బాగా పాపులర్ అయిన ఫీచర్. కానీ, ఎస్‌యూవీలలో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ వెర్షన్‌లోనూ ఇదే జరిగింది. ఈ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ మార్కెట్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అందుకే, అతి తక్కువ కాలంలోనే ఇది మార్కెట్ నుండి తొలగిపోయింది. ఈ మోడల్ మార్కెట్ నుండి తొలగిపోయినప్పటికీ, ఔత్సాహికులు మాత్రం ఇది తిరిగి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
MOST READ:ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

బిఎమ్‌డబ్ల్యూ ఐసెట్టా
ఈ ఫొటోలో కనిపిస్తున్న కారును జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తయారు చేసింది. ప్రస్తుతం పెద్ద ఫ్రంట్ గ్రిల్స్‌తో హై-ఎండ్ సెడాన్లు మరియు ఎస్‌యూవీలను ఉత్పత్తి ఈ లగ్జరీ కార్ బ్రాండ్ గతంలో ఈ కారును తయారు చేసింది. ఈ కారు పేరు బిఎమ్‌డబ్ల్యూ ఐసెట్టా, 1955లో కంపెనీ ఈ కారును తయారు చేసింది.

అప్పట్లో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. బిఎమ్‌డబ్ల్యూ ఇసెట్టా, ఈ బ్రాండ్ నుండి వచ్చిన చాలా ప్రత్యేకమైన మోడల్, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇది ఆ సమయంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురైంది. బిఎమ్‌డబ్ల్యూ ఇసెట్టా ఇటాలియన్ రూపొందించిన మైక్రోకార్, అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

ఈ కారును ముద్దుగా ‘బబుల్ కార్' అని పిలిచేవారు. ముందు భాగంలో తెరవడానికి ఒకే తలుపు ఉన్న కార్ ఇది. ఇందులో 250 సిసి ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించేవారు. ఆ ఇంజన్ గరిష్టంగా 12 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. సుమారు 33 కి.మీ / లీ (3-లీటర్లు / 100 కి.మీ) మైలేజీని ఇచ్చేది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్-ప్రొడక్షన్ కారు.

ఆస్టన్ మార్టిన్ సిగ్నెట్
ఆస్టన్ మార్టిన్ పేరు వినగానే జేమ్స్ బాండ్ చిత్రాలు గుర్తొస్తాయి. ఆ చిత్రాల్లో బాండ్ ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ కార్ల ద్వారా ఈ బ్రాండ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆస్టన్ మార్టిన్ మనకు హై-ఎండ్ సెడాన్ కార్లు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, ఆస్టన్ మార్టిన్ 'సిగ్నెట్' అనే పేరుతో ఓ బుజ్జి కారును కూడా తయారు చేసింది.
MOST READ:రోడ్డుపైకి రానున్న మరో రేస్ కార్ లంబోర్ఘిని హురాకాన్ ఎస్టిఓ ; వివరాలు

సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఆస్టన్ మార్టిన్ తమ సిగ్నెట్ కారు తయారీకి బీజం వేసింది. ప్రత్యేకించి పట్టణ ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని ఆస్టన్ మార్టిన్ తయారు చేసిన హ్యాచ్‌బ్యాక్ ఈ సిగ్నెట్. ఈ కారులో 97 బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే చిన్న 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయబడటానికి ముందు కేవలం రెండేళ్లపాటు మాత్రమే ఇది వాడుకలో ఉండేది. సిగ్నెట్ ఆస్టన్ మార్టిన్ బ్రాండ్‌కు ఆశించిన విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. కానీ, ఈ మోడల్‌కు ఇప్పటికీ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇది చాలా అరుదైన ఆస్టన్ మార్టిన్ కార్లలో ఒకటిగా మారింది.

లాంబోర్గినీ ఎల్ఎమ్002
లాంబోర్గినీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి, హై-ఎండ్ స్పోర్ట్ కార్లు, సూపర్ కార్లు. కానీ, ఈ ఇటాలియన్ సూపర్ బ్రాండ్ గతంలో ఓ ఎస్‌యూవీని (లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ కేంటే ముందుగా) కూడా తయారు చేసింది. దాని పేరే ఎల్ఎమ్002. ప్రస్తుతం మార్కెట్లో లాంబోర్గినీ నుండి ఒకే ఒక ఎస్‌యూవీ (ఉరుస్) మాత్రమే లభిస్తుంది.

ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ ఎస్‌యూవీల కోసం డిజైన్ చేసిన మూడు ప్రోటోటైప్‌లలో ఉత్పత్తి దశకు చేరుకుంది మాత్రం ఎల్ఎమ్002 మోడలే. దానికి ముందు కంపెనీ చిరుత మరియు ఎల్ఎమ్001 అనే రెండు ప్రోటోటైప్‌లను తయారు చేసింది. లాంబోర్గినీ ఎల్ఎమ్002 ఒక డ్యూయెల్ క్యాబిన్ ఆఫ్-రోడ్ ట్రక్, ఇది సైనిక ఉపయోగం కోసం ఉద్దేశించబడింది.

ఈ ఐకానిక్ కౌంటాచ్‌లో శక్తివంతమైన 5.2-లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ఈ కారుకి కుడా మార్కెట్ నుండి ఆశించిన స్పందన రాలేదు, ఇందుకు ప్రధాన కారణం దానికున్న సూపర్ కార్ ఇమేజే. సూపర్ కార్ తయారీదారు నుండి వచ్చిన ఎస్‌యూవీని మార్కెట్ స్వీకరించలేకపోయింది.

లెక్సస్ ఎల్ఎఫ్ఏ
లెక్సస్ ఎల్‌ఎఫ్‌ఏ ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే ఉత్తమ ధ్వనించే సూపర్ కార్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కారును 2009లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల కృషి మరియు మిలియన్ డాలర్లు ఖర్చు ఫలితమే ఈ లగ్జరీ స్పోర్ట్స్ కార్.

ఎల్ఎఫ్ఏ సూపర్ కార్ గురించి ప్రధానంగా చెప్పుకోవల్సింది దాని పెర్ఫార్మెన్స్. టొయోటాకి చెందిన ప్రీమియం కార్ల తయారీ విభాగమైన లెక్సస్, ఎల్ఎఫ్ఏ తయారు చేయడానికి ముందు కేవలం హై-ఎండ్ లగ్జరీ కార్లను మాత్రమే తయారు చేసేది, కానీ సూపర్ కార్లను తయారు చేయలేదు. ఎల్ఎఫ్ఏ రాకతో లెక్సస్ భవిష్యత్తే మారిపోయింది.

లెక్సస్ ఎల్ఎఫ్ఏ సూపర్ కారులో 4.8-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారు 552 బిహెచ్‌పి పవర్‌ను మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-క్లచ్ సెమీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.