గుండెపోటుతో కన్నుమూసిన 'విక్రమ్ కిర్లోస్కర్'.. పలువురు ప్రముఖులు సంతాపం

భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ప్రసిద్ధి చెందిన కీర్తి పొందిన టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ 'విక్రమ్ కిర్లోస్కర్' మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని టయోటా ఇండియా తన అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించింది.

టయోటా ఇండియా అందించిన అధికారిక సమాచారం ప్రకారం, టయోటా కిర్లోస్కర్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ 'విక్రమ్ కిర్లోస్కర్' 2022 నవంబర్ 29 అంటే మంగళవారం రోజున కన్నుమూశారు. మరణించిన తరువాత ఆయన పార్థివ దేహాన్ని సాధారణ ప్రజల సందర్శనార్థం హెబ్బాల్‌లో ఉంచనున్నారు. ఆ తరువాత 2022 నవంబర్ 30 న ఈ రోజు (బుధవారం) 1 గంటకు హెబ్బాల్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

గుండెపోటుతో కన్నుమూసిన విక్రమ్ కిర్లోస్కర్

నిన్న ఉదయం (మంగళవారం) 'విక్రమ్ కిర్లోస్కర్' కి గుండెపోటు రావడం వల్ల చికిత్స కోసం బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మణిపాల్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత పరిస్థితి విషమించి అసువులు బాసారు. కిర్లోస్కర్ గ్రూప్‌కు విక్రమ్ కిర్లోస్కర్ నాలుగో తరం అధినేత. తర్వాత టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వైస్ ఛైర్మన్‌ గా నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

విక్రమ్ కిర్లోస్కర్ టయోటా కిర్లోస్కర్ వైస్ ఛైర్మన్‌ గా మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. కంపెనీ యొక్క అభివృద్ధిలో ఈయన పాత్ర చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈయన MIT నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ తరువాత CII, SIAM, ARAI గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మానసి కిర్లోస్కర్ ఉన్నారు.

ఇటీవల టయోటా కంపెనీ యొక్క హైక్రాస్ ఆవిష్కరణ కోసం ముంబైలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది నవంబర్ 25 న ఆవిష్కరించబడింది. విక్రమ్ కిర్లోస్కర్ కి గోల్ఫ్ అన్నా, టెన్నిస్ అన్నా చాలా ఇష్టమని తెలిసింది. సమయం దొరికినప్పుడు ఈ ఆటలు ఆడేవారని కూడా సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే విక్రమ్ కిర్లోస్కర్ అకాల మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటు అనే చెప్పాలి.

భారతీయ మార్కెట్లో విశేషమైన ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి టయోటా. ఈ ఘనత వెనుక విక్రమ్ కిర్లోస్కర్ కృషి చాలా ఎక్కువగా ఉంది. 64 ఏళ్ల వయసులో కూడా నిరాఘాటంగా కంపెనీ యొక్క అభివృద్ధికి చాలా దోహదపడ్డారు. టయోటా గ్రూప్ 1997 లో ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్‌‌లో 89 శాతం వాటా టయోటాదే. ఇందులో కిర్లోస్కర్ గ్రూప్ వాటా 11 శాతంగా ఉంది.

కంపెనీ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇటీవల హైక్రాస్ అనే కొత్త కారుని దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ లేటెస్ట్ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ కారు ధరలు వచ్చే సంవత్సరం ప్రారంభంలో వెల్లడవుతాయి. కాగా ఈ కొత్త టయోటా హైక్రాస్ యొక్క బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారభమయ్యాయి.

కంపెనీకి పారిశ్రామిక రంగంలో అశేషమైన అభివృద్ధిని తీసుకురాడానికి ఎల్లప్పుడు పాటుపడిన 'విక్రమ్ కిర్లోస్కర్' మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వంటి పలువురి ప్రముఖులు సంతాపం తెలియజేసారు. నిజంగానే విక్రమ్ కిర్లోస్కర్ మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని చాలా మంచి ప్రముఖులు అన్నారు. అయితే ఈ రోజు ఈయన అంత్యక్రియలు పూర్తవుతాయని సంబంధిత వ్యక్తులు అధికారికంగా తెలిపారు.

Most Read Articles

English summary
Toyota kirloskar vice chairman vikram kirloskar passes away details
Story first published: Wednesday, November 30, 2022, 15:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X