కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

మీ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, అది బైక్ అయినా లేదా కారు అయినా సరే, వీటి విషయంలో సరైన మెయింటినెన్స్ ఎంతో అవసరం. వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీస్ చేయించడం, లోపాలు ఏవైనా గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయించుకోవటం మంచిది. ప్రత్యేకించి, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వాహనాల నిత్యం శుభ్రపరచడం చాలా అవసరం.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

వాటర్ సర్వీసింగ్ కోసం వాహనాలను ఖరీదైన వాటర్ వాష్‌ల వద్దకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటిలో ఉండే నీరు, షాంపూ వంటి వాటితోనే వాహనాలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. కనీసం వారానికి ఒక్కసారైనా వాహనాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే, అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

ఎక్స్టీరియర్‌ను సురక్షితంగా ఉంచుతుంది

వారంలో ఒక్కసారైనా మీ కారును శుభ్రం చేసుకుంటూ ఉండటం వలన కారు ఎక్స్టీరియర్ చాలా క్లీన్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, వాహన పెయింట్ యొక్క మన్నికను కూడా ఇది పెంచుతుంది. కారుపై బురద, ధూళి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కారు బాహ్య భాగాలను తుప్పు పట్టేలా చేస్తుంది.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

ఇటీవలి కాలంలో, వాహన కంపెనీలు తమ వాహనాలపై మంచి పెయింట్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇవి త్వరగా చెదిరిపోకుండా, తుప్పు పట్టకుండా ఉండేలా ఉంటాయి. వాహనాన్ని వాష్ చేసిన తర్వాత, వ్యాక్సింగ్ చేసుకుంటే వాహనంపై ఉండే పెయింట్ మరింత ఎక్కువ కాల మన్నుతూ, వాహనం మెరుస్తూ కనిపిస్తుంది. ఇలా వాక్సింగ్ చేయటం వలన కారుపై దుమ్ము, ధూళి వలన సన్నపాటి గీతలు కూడా పడే ప్రమాదం ఉండదు.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

ఇంధన సామర్థ్యం పెరుగుతుంది

కారుకు ధూళి మరియు బురద అంటుకోవడం కూడా దాని ఇంధన సామర్థ్యాన్ని చాలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా, మీ కారు మైలేజ్ కూడా తగ్గిస్తుంది. మీ కారు నుండి మంచి మైలేజ్ కావాలంటే మీరు దానిని శుభ్రంగా ఉంచడం ఎంతో అవసరం. శుభ్రమైన కార్ల వలన మైలేజ్ సుమారు 10 శాతం వరకూ పెరుగుతుంది.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

శుభ్రమైన కారు అంటే సురక్షితమైన కారు

మీరు మీ కారు వెలుపలి భాగాన్ని కడిగేటప్పుడు, మీరు దాని విండ్‌షీల్డ్ మరియు కిటికీ అద్దాలను కూడా శభ్రంగా కడగాలి. శుభ్రమైన విండ్‌షీల్డ్ మరియు కిటికీ అ్దదాలు కారు లోపలి నుండి మీ దృష్టిని (విజిబిలిటీని) పెంచుతాయి. దుమ్ము లేదా ధూళి వాటిపై అంటుతుంటే, మీరు రోడ్డుపై వచ్చే వాహనాలను స్పష్టంగా చూడలేరు.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

ఇతర సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది

మీరు మీ కారును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండటం వల్ల, కారులో తలెత్తే ఇతర సమస్యల గురించి కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే, ఆ సమయంలో మీరు మీ కారు వెలుపలి భాగాన్ని మెత్తటి బ్రష్ లేదా వస్త్రంతో శుభ్రం చేస్తుంటారు, కాబట్టి కారుపై ఉండే డెంట్స్ లేదా గీతలను మీరు సులభంగా గుర్తించగలరు.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

రెగ్యులర్ కార్ వాషింగ్ నిజంగా వ్యత్యాసాన్ని చూపిస్తుంది

వారానికి ఒకసారైనా కార్ వాషింగ్ చేయటం వలన, మీ కారును దాని ఉత్తమ స్థితిలో ఉంచడమే కాకుండా, ఎల్లప్పుడూ కొత్త దానిలా ఉంచడంలో సహాయపడుతుంది. కార్ల క్లీనికం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లిక్విడ్ కార్ క్లీనర్ మరియు వాషింగ్ మిట్స్ వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తే, కారుపై గీతలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

రీసేల్ వ్యాల్యూ పెరుగుతుంది

మీరు తరచూ శుభ్రం చేసుకుంటూ, మంచి కండిషన్‌లో ఉంచుకున్నట్లయితే, ఒకవేళ మీరు మీ కారును వేరే ఎవరికైనా లేదా డీలరుకైనా విక్రయించాలనుకున్నప్పుడు దాని శుభ్రమైన స్థితి కారణంగా మార్కెట్ రీసేల్ వ్యాల్యూ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి, బెటర్ రీసేల్ వ్యాల్యూ కోసం క్లీన్ కార్ ఎంతో అవసరం.

కారుని క్రమం తప్పకుండా వాష్ చేస్తుంటే మైలేజ్ పెరుగుతుందా?

మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం కూడా!

శుభ్రమైన కారులో మీరు ఎక్కడికి వెళ్లినా మీకు ప్రత్యేక గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాదు, కారును నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం వలన మానసిక ఉల్లాసం కూడా లభస్తుంది. శుభ్రమైన కారు లోపల చాలా సమయం గడుపాలని అనిపిస్తుంటుంది. అంతేకాదు, కారును శుభ్రం చేసుకోవటం కోసం శారీరకంగా శ్రమించడం వలన శరీరానికి అదనపు వ్యాయామం కూడా లభిస్తుంది.

Most Read Articles

English summary
Why You Need To Wash Your Car Regularly? Benefits And Tips. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X