ధ్వంసమైన కారులో 'వైఎస్. షర్మిల': టోయింగ్ వేసి కారునే లాక్కెళ్లిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు 'వైఎస్ షర్మిల' తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) స్థాపించి గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ పాదయాత్రలో కొంచెం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సోమవారం రోజున వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రచార వాహనంపై దాడి జరిగిన కారణంగా ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించింది. అయితే ఈ సందర్భంలో దాడిలో దెబ్బతిన్న కారుని షర్మిల స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. ఆ సమయంలో సోమాజీగూడ మీదుగా ప్రగతిభవన్ వెళ్తున్న షర్మిలను పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు. జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్‌టీపీ కార్యకర్తలతో కలిసి ప్రగతిభవన్ ముట్టడికి Y.S. షర్మిల ప్రయత్నించారు.

ధ్వంసమైన కారులో వైఎస్. షర్మిల

సోమాజీ గూడ మీదుగా ప్రగతి భవన్ వెళ్తుండగా పంజాగుట్టలో పోలీసులు అడ్డుకుని షర్మిలను అరెస్ట్ చేశారు. వైఎస్‌ షర్మిల ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్‌ పోలీసులు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించకుండా లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కారు విండ్ షీల్డ్ పగిలి ఉండటం, అయినప్పటికీ ఆ కారులోనే షర్మిల ఉండటం వంటి దృశ్యాలు చూడవచ్చు.

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ రోడ్డు నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు కారుని లాక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో కారులో షర్మిల ఉంది. షర్మిల ఉన్న కారు టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ అని తెలిసింది. ఈ ఫార్చ్యూనర్ కారుని పోలీసులు టోయింగ్ ట్రక్ సాయంతో లాక్కుంటూ వెళ్లారు. షర్మిల కాన్వాయ్ మీద బీఆర్‌ఎస్ కార్మికులు దాడి చేశారని మరియు పాదయాత్రకు కూడా అనుమతి రద్దు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని భారత రాష్ట్ర స్మితి (BRS) కార్యకర్తలు షర్మిల ప్రయాణించే టయోటా ఫార్చ్యూనర్ కారు విండ్‌షీల్డ్‌లను దాడిలో ధ్వంసం చేశారు. కారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకునే వరకు ఆమె వాహనంలోనే ఉండిపోయింది. చివరికి పోలీసులు కారు నుంచి బయటకు రావాలని చెప్పారు. కానీ దీనికి కూడా షర్మిల ససేమిరా అనటంతో బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ హైడ్రామా మొత్తం కొన్ని గంటల్లోనే జరిగిపోయింది.

నిజానికి కారులో ఉండగానే వ్యక్తులను తీసుకెళ్లడం చట్టరీత్య నేరం, అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. గతంలో మంబైకి చెందిన ఒక ట్రాఫిక్ పోలీస్ నో-పార్కింగ్ జోన్‌లో బిడ్డకు పాలు ఇస్తున్న మహిళ కారులో ఉండగానే తీసుకెళ్లారు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయింది. కాన్పూర్‌లో జరిగిన మరో సంఘటనలో ఒక వ్యక్తి బైక్ మీద ఉన్నప్పటికీ అలాగే టోయింగ్ వేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

గతంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలన్నీ కూడా సాధారణ పౌరులకు చెందిన కార్లు. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సంఘటన రాజకీయ సంఘటన. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. దీని పైన అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఒక పార్టీ కార్యదర్శిని కారులోనే ఉంచి లాగడం అనెదియూ చాలా వరకు అమానుషం అనే చెప్పాలి.

ఇక టోయింగ్ లో లాక్కెళ్లిన టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, ఇది ఎక్కువమంది ప్రజలకు మాత్రమే కాకుండా, ఎక్కువమంది రాజకీయ నాయకులకు కూడా ఇష్టమైన కారు. ఇది దృఢమైన డిజైన్, అధునాగతన ఫీచర్స్ తో ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ysrtp president ys sharmila arrest with car in hyderabad
Story first published: Wednesday, November 30, 2022, 13:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X