'దూమ్ 3'లో దుమ్మురేపనున్న అమీర్ ఖాన్ బైక్ సీన్

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల సత్యమేవ జయతే అంటూ చేసిన ప్రోగ్రామ్‌తో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి మంచి పేరును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రజా ప్రేమికుడు ఇప్పుడు తాజాగా 'దూమ్ 3' చిత్రంలో నటించనున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన దూమ్ 1, దూమ్ 2 సినిమాలకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో అనేక అద్భుతాలను ప్రేక్షకులు చూడనున్నారు.

ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ బిఎమ్‌డబ్ల్యూ సూపర్‌బైక్‌తో వళ్లు గగుర్పొడిచే స్టంట్‌లు చేయనున్నాడు. బైక్ చేజ్‌లు, కార్ చేజ్‌లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దూమ్ 3 సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను డ్రైవ్ స్పార్క్ గ్యాలరీలో చూడొచ్చు. ఈ చిత్రలం పవర్‌‌ఫుల్ బిఎమ్‌డబ్ల్యూ కె 1300 ఆర్ సూపర్‌బైక్‌ను అమీర్ ఖాన్ రైడ్ చేస్తూ కనిపిస్తాడు. ఈ బైక్ అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత ఖరీదైనది కూడా.

జర్మన్ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ యూనిట్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ సూపర్‌బైక్‌లను తయారు చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ కె 1300 ఆర్ సూపర్‌బైక్ మంచి స్టయిలిష్ లుక్‌ని కలిగి ఉండి పవర్‌ఫుల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో 1293సీసీ వాటర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి ఇంచు మించు 2లీటర్ ఇంజన్ కలిగిన కారు శక్తితో సమానం.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియన్ మార్కెట్లో తమ సూపర్‌బైక్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ బైక్‌ను స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి దిగుమతి చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోడల్‌ను కంపెనీ భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ కె 1300 ఆర్ సూపర్‌బైక్ ధర సుమారు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

దూమ్ 2 సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న దూమ్ 3 చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, కత్రినా కైఫ్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

Most Read Articles

English summary
Bollywood actor Aamir Khan rides a BMW K 1300 R Superbike for his upcoming movie 'Dhoom 3'. BMW K 1300 R is powered by 1293cc water-cooled 4-stroke in-line four-cylinder engine. It can generate maximum power of 173 bhp and peak torque of 140 Nm.
Story first published: Thursday, August 16, 2012, 13:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X