స్కూటర్ వ్యాపారంలోకి పునఃప్రవేశించనున్న బిఎమ్‌డబ్ల్యూ

ఈ స్కూటర్ గుర్తుందా..? ఇది జర్మన్ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ గతంలో ఆవిష్కరించిన తమ ఈ స్కూటర్ కాన్సెప్ట్‌. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ స్కూటర్ కాస్తా ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అత్యధిక పవర్ కలిగిన మోటార్‌సైకిళ్లు, సూపర్‌బైక్‌లు తయారు చేస్తూ వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు మళ్లీ తిరిగి స్కూటర్ల ఉత్పత్తిపై దృష్టి సారించనుంది.

ఇందుకు ప్రధాన కారణం, తమ సమీప పోటీదారు అయిన ఆడి ఇటీవలే ప్రముఖ ఇటాలియన్ కంపెనీ మోటార్‌సైకిల్ కంపెనీ డ్యుకాటిని సొంతం చేసుకుని ద్విచక్ర వాహన వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కార్ల వ్యాపారంలో బిఎమ్‌డబ్ల్యూకి ప్రపంచవ్యాప్తంగా గట్టి పోటీ ఇస్తున్న ఆడి బ్రాండ్, డ్యుకాటి సాయంతో టూవీల్ మార్కెట్లో కూడా బిఎమ్‌డబ్ల్యూకి చెక్ పెట్టాలని యోచిస్తోంది.


ఈ నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ తన మార్కెట్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. అర్బన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా స్కూటర్లను డిజైన్ చేయటంపై కంపెనీ దృష్టి సారించింది. సి1 స్కూటర్‌ ఉత్పత్తిని నిలిపివేసిన 9 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ ఈ సెగ్మెంట్లోకి బిఎమ్‌డబ్ల్యూ ప్రవేశించనుంది.బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా 1923లో మోటార్‌సైకిళ్ల తయారీ ప్రారంరభించింది.

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అనే పేరుతో కంపెనీ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇక ఈ బిఎమ్‌డబ్ల్యూ ఈ-స్కూటర్ విషయానికి వస్తే.. ఇది గరిష్టంగా గంటకు 75 మైళ్ల వేగంతో పరుగులు పెడుతూ, సింగిల్ ఛార్జ్‌పై 100 కి.మీ. ప్రయాణించవచ్చు. దీని పవర్ 600సీసీ స్కూటర్ పవర్‌తో సమానం.

Most Read Articles

English summary
BMW’s electric scooter is designed to achieve the performance specification of a gasoline-fueled scooter. This all-electric scooter will pack a top speed of 75mph, and a full charged battery range of 100 kilometers or 62 miles plus the range added with the use of its regenerative braking system. And it plugs into standard electric cars charging stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X