యాక్టివా స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఖరీదు రూ.7 లక్షలు

By Ravi

ఏకె-47, ఈ పేరు వినగానే మనకు పాపులర్ రష్యన్ తుపాకీ ఏకె-47 (AK-47: Avtomat Kalashnikova-47) గుర్తుకువస్తుంది. అయితే, పంజాబ్‌లో మాత్రం ఏకె-47 అనగానే కుల్బీర్ సింగ్ హోండా యాక్టివా స్కూటరే గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు ఈయన యాక్టివా స్కూటర్‌కి సంబంధం ఏంటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! వాహనాలకు లక్కీ నెంబర్‌ను అందరికీ కోరిక ఉంటుంది. అయితే, వీటిని కొనుగోలు చేసే స్థోమత కొంత మందికి మాత్రమే ఉంటుంది.

ఎవరైనా రూ.50,000 విలువ చేసే స్కూటర్‌కు రూ.7,00,000 విలువ చేసే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొనుగోలు చేస్తారా..? ఎందుకు చేయరు, పంజాబ్‌లో ఇలాంటి వాళ్లు, ఇలాంటి నెంబర్ ప్లేట్లు మనకు దర్శనమిస్తాయి. పంజాబ్‌లోని కటోవల్ గ్రామానికి చెందిన కుల్బీర్ సింగ్ అనే ఓ రైతు తన రూ.53,000 విలువ చేసే హోండా యాక్టివా స్కూటర్ కోసం వేలంలో రూ.7 లక్షలు చెల్లించి పిబి-07 ఏకె-47 (PB-07 AK-47) అనే ఫ్యాన్సీ నెంబర్‌ను కొనుగోలు చేశాడు.

Honda Activa

ఆర్టీవో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ నెంబర్ కోసం 16 మంది వేలంలో పాల్గొన్నారు, వారంతా కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను పొందేందుకు ఎంత మొత్తాన్నైనా చెల్లించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఆరుగురు రూ.5 లక్షల తర్వాత కూడా తమ వేలాన్ని కొనసాగించారట. ఎలాగైనా ఈ నెంబరును సొంతం చేసుకోవాలని ఇటలీలో ఉన్న తన అన్న అమన్‌ప్రీత్ సింగ్, అమెరికాలో ఉన్న కజిన్ దిల్షర్ సింగ్ దహిల్వాల్‌లు చెప్పారని, ఈ నెంబర్ ధర రూ.12-13 లక్షలైనా చెల్లించేందుకు తాము సిద్ధమేనని కుల్బీర్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఏకె-47 చాలా పాపులర్ నెంబర్ అని, తమ వద్ద ఇదివరకే 47 నెంబర్‌తో కూడిన వాహనాలు ఉన్నప్పటికీ, ఏకె-47తో ఉన్నవి లేవని సింగ్ చెప్పాడు. త్వరలో టొయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసి ఈ ఏకె-47 నెంబర్‌ను స్కూటర్ నుంచి కారుకు మార్పించుకుంటానని కుల్బీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. గతంలో కూడా పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి చంఢీఘడ్‌లో ప్రారంభించిన లేటెస్ట్ నెంబర్ సిరీస్ 'సిహెచ్01-ఏకె-0047'ను వేలంలో రూ.3.10 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు.

Most Read Articles

English summary
Punjab based farmer Kulbir Singh paid a whopping Rs 700,000 for his Activa scooter, which costs around Rs 53,000 during an auction for auction for vehicle registration numbers at Hoshiarpur.
Story first published: Thursday, March 21, 2013, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X