పల్స్ రైజింగ్ పల్సర్ కు బోష్ ఏబీఎస్ పరికరాలు?

By Vinay Kumar

బజాజ్ ఆటో భారత మార్కెట్లో ఓ ప్రముఖ స్పోర్ట్ బైక్ తయారీ సంస్థ. బజాజ్ ఇటీవల అద్భుతమైన లుక్ ఉన్న మోటార్ సైకిల్ ను విడుదల చేసి, దానికి పల్సర్ ఆర్ఎస్200గా నామకరణం చేసింది.

ఈ భారత ద్విచక్రవాహన తయారీ సంస్థ ఏబీఎస్ లేని మోడల్ ధరను 1,18,500 (ఎక్స్-షోరూమ్,ముంబై) గాను, ఏబీఎస్ పరికరం ఉన్న మోడల్ ధరను 1,30,268(ఎక్స్-షోరూమ్, ముంబై) గాను నిర్ణయించింది.

pulsar

పల్సర్ ఆర్ఎస్200 పల్స్ రైజింగ్ భద్రతా పరికరం అయిన ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆప్షన్ ను కలిగి ఉంది. ఈ ఏబీఎస్ బోష్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒకే ఛానల్ కలిగిన వ్యవస్థ.

ఎక్కువ పీడనం పడే ముందు చక్రానికి ఏబీఎస్ వ్యవస్థను అమర్చారు. ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగపడే విధంగా బోష్ దీన్ని రూపొందించింది, అందిస్తోంది.

bosh

బోష్ లిమిటెడ్ ఎండీ మరియు బోష్ గ్రూప్ ఇండియా అధ్యక్షులు డా.స్టెఫెన్ కామెంట్ చేస్తూ " మేము అన్ని రకాల మార్కెట్లకు అవసరమున్న విధంగా ఏబీఎస్ వ్యవస్థను పరిచయం చేస్తున్నాము. అది బైక్ నడిపేటప్పుడు అత్యధిక మోటార్ సైకిల్ స్టెబిలిటీ కంట్రోల్ ను అందిస్తుంది " అని తెలిపారు.

బోష్ అనేక తయారీ సంస్థలలాగే ఏబీఎస్ వ్యవస్థను అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి పల్సర్ ఆర్ఎస్200లో ఒకే ఛానల్ కలిగిన వ్యవస్థగా అందిస్తోంది. అన్ని మోటార్ సైకిళ్లకి ఏబీఎస్ వ్యవస్థను తప్పనిసరి చేస్తే అది బోష్ కు ప్రయోజనకరంగా మారనుంది.

Most Read Articles

English summary
Bajaj Auto is the leading manufacturer of sport bikes in the Indian market. They recently introduced their first fully faired motorcycle, which they christened Pulsar RS200.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X