హోండా నుండి కొత్త సిటి అడ్వెంచర్ కాన్సెప్ట్ స్కూటర్
హోండా టూవీలర్స్ మిలాన్‌లో జరుగుతున్న ఆటో షోలో తన కొత్త స్కూటర్‌న ప్రవేశ పెట్టింది. తన కొత్త తరం కాన్సెప్ట్ స్కూటర్ పేరు హోండా సిటి అడ్వెంచర్ స్కూటర్ కాన్సెప్ట్. అయితే హోండా దీని గురించి అతి తక్కువ సమాచారాన్ని విడుదల చేసింది. అయినప్పటికి డ్రైవ్‌స్పార్క్ దీనిలో ఎటువంటి ఫీచర్లు ఉండబోతున్నాయో అనే దానికి గురించి క్రింది కథనాల ద్వారా వివరిస్తోంది.

డిజైన్
ఈ అడ్వెంచర్ స్కూటర్‌లో ఇలాంటి ఫీచర్లే ఉన్నాయి. ఇందులో టాల్ స్టేన్స్, ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, మరియు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న విండ్ స్క్రీన్ ఇందులో ప్రత్యేకం.

ఇంజన్
హోండా సిటి అడ్వెంచర్ కాన్సెప్ట్ స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన ట్విన్ సిలిండర్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

డిస్క్ బ్రేక్స్
హోండా సిటి అడ్వెంచర్ కాన్సెప్చ్ స్కూటర్‌కు ముందు మరియు వెనుకవైపున గల రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించారు.

సిటీ రోడ్ల మీద
ఈ గేర్ స్కూటర్ సిటి రోడ్ల చక్కటి పనితీరు కనబరుస్తుంది. అయితే హైవే రోడ్ల మీద దీని పని తనం గురించి ఇది మార్కెట్లోకి విడుదలైతే గాని చెప్పలేం.



Click it and Unblock the Notifications








