పొడుగ్గా ఉన్న వారికోసం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లు

By Anil

భారతీయులు ప్రస్తుతం బైకులను ఎంతగా ఆదరిస్తున్నారో అధే విదంగా స్కూటర్లను కూడా ఎంచుకుంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు సులభంగా రైడ్ చేయగలగడం, ఉత్పత్తమ మైలేజ్ మరియు బైకుల తరహాలో పనితీరు కనబరచడం. ఇండియన్ మార్కెట్లో స్కూటర్ల విభాగం అత్యంత ఆదరణ పొందడానికి ఇవే ముఖ్యమైన కారణాలు అని చెప్పవచ్చు.

ఇంతటి ప్రత్యేకత ఉన్నప్పటికీ స్కూటర్లు పొడుగ్గా ఉన్న వారిని మెప్పించలేకపోయాయి. కారణం స్కూటర్లు బైకుల కన్నా పొట్టిగా ఉండటం. అయితే స్కూటర్లను రైడ్ చేయాలని పొడుగ్గా ఉన్న వారు కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అందుకోసం పొడుగ్గా ఉన్న ఇండియన్ల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లను క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

6. హోండా ఆక్టివా

6. హోండా ఆక్టివా

ఇండియన్ మార్కెట్లోకి దీనిని విడుదల చేసిన నాటి నుండి నేటి వరకు అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న నెంబర్ వన్ స్కూటర్ హోండా ఆక్టివా. ఇది మేము ఇస్తున్న కితాబు కాదు ప్రతి నెలా దీనిని ఎంచుకుంటున్న మంది నిర్ణయం. ఆక్టివా స్కూటర్ గరిష్టంగా 760 ఎమ్ఎమ్ గల సీటును కలిగి ఉంది. కాబట్టి ఇది పొట్టి మరియు పొడగరులకు బాగా సూట్ అవుతుంది. భారీ స్థాయిలో అమ్మకాలకు ఇది కూడా ఒక కారణం కావచ్చేమో !

హోండా ఆక్టివా సాంకేతిక వివరాలు

హోండా ఆక్టివా సాంకేతిక వివరాలు

  • ఇంజన్: 109సీసీ
  • పవర్ మరియు టార్క్: 8 బిహెచ్‌పి మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్
  • మైలేజ్: 66 కిలోమీటర్లు
  • సీటు ఎత్తు: 760 ఎమ్ఎమ్
  • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 53,000 లు
  • 5. టీవీఎస్ జూపిటర్

    5. టీవీఎస్ జూపిటర్

    ఇండియన్ స్కూటర్ల మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న దేశీయ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్‌కు చెందిన స్కూటర్ జూపిటర్. ఈ జూపిటర్ స్కూటర్ పొడుగ్గా ఉన్న వాళ్ల మనస్సును దోచుకోవడానికి 765 ఎమ్ఎమ్ ఎత్తు గల సీటును కలిగి ఉంది. టీవీఎస్ తమ జూపిటర్ స్కూటర్‌ను ఆకర్షణీయమైన మట్టి ఫినిష్ రంగుల్లో అందిస్తోంది.

    టీవీఎస్ జూపిటర్ సాంకేతిక వివరాలు

    టీవీఎస్ జూపిటర్ సాంకేతిక వివరాలు

    • ఇంజన్: 109సీసీ
    • పవర్ మరియు టార్క్: 7.8 బిహెచ్‌పి మరియు 8 ఎన్ఎమ్ టార్క్
    • మైలేజ్: 62 కిలోమీటర్లు
    • సీటు ఎత్తు: 765 ఎమ్ఎమ్
    • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 55,000 లు
    • 4. మహీంద్రా గస్టో

      4. మహీంద్రా గస్టో

      మహీంద్రా టూ వీలర్స్‌లో ఉన్న స్టాండర్జ్ స్కూటర్ గస్టో. ఇందులో సీటు ఎత్తును సరిచేసుకునే వీలు ఉండటం వలన ఇది పొట్టి మరియు పొడవుగా ఉన్న వారికి చక్కగా సెట్ అవుతుంది. స్కూటర్ల సెగ్మెంట్లో సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్ గల ఏకైక స్కూటర్ మహీంద్రా గస్టో.

      మహీంద్రా గస్టో సాంకేతిక వివరాలు

      మహీంద్రా గస్టో సాంకేతిక వివరాలు

      • ఇంజన్: 109సీసీ
      • పవర్ మరియు టార్క్: 8 బిహెచ్‌పి మరియు 9 ఎన్ఎమ్ టార్క్
      • మైలేజ్: 61 కిలోమీటర్లు
      • సీటు ఎత్తు: 770 ఎమ్ఎమ్
      • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 52,000 లు
      • 3. హీరో మాయెస్ట్రో

        3. హీరో మాయెస్ట్రో

        హీరో మోటో కార్ప్‌కు చెందిన హీరో మాయెస్ట్రో స్కూటర్ 770 ఎమ్ఎమ్ ఎత్తు గల సీటును కలిగి ఉంది. ఇది ఒక రకంగా పొట్టిగా మరియు పొడవుగా ఉన్న వారికి కూడా అప్పనంగా నప్పుతుంది.

        హీరో మాయెస్ట్రో సాంకేతిక వివరాలు

        హీరో మాయెస్ట్రో సాంకేతిక వివరాలు

        • ఇంజన్: 109సీసీ
        • పవర్ మరియు టార్క్: 8 బిహెచ్‌పి మరియు 9 ఎన్ఎమ్ టార్క్
        • మైలేజ్: 68 కిలోమీటర్లు
        • సీటు ఎత్తు: 770 ఎమ్ఎమ్
        • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 55,000 లు
        • 2. పియాజియో వెస్పా

          2. పియాజియో వెస్పా

          వెస్పా స్కూటర్‌లో హైట్ మరియు స్టైల్ రెండు కూడా మీరు పొందుతారు. పియాజియో వారి వెస్పా స్కూటర్ 770 ఎమ్ఎమ్ ఎత్తు గల సీటును కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని స్కూటర్ల కన్నా వెస్పా డిజైన్ ఎంతో అత్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా వెస్పా విభిన్నమైన రంగుల్లో లభిస్తుంది.

          వెస్పా సాంకేతిక వివరాలు

          వెస్పా సాంకేతిక వివరాలు

          • ఇంజన్: 125సీసీ
          • పవర్ మరియు టార్క్: 10 బిహెచ్‌పి మరియు 11 ఎన్ఎమ్ టార్క్
          • మైలేజ్: 55 కిలోమీటర్లు
          • సీటు ఎత్తు: 770 ఎమ్ఎమ్
          • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 87,000 లు
          • 1. హోండా ఏవియేటర్

            1. హోండా ఏవియేటర్

            హోండా వారి ఏవియేటర్ స్కూటర్ సీటు ఎత్తు 790 ఎమ్ఎమ్‌గా ఉంది. హోండా స్కూటర్లలో టాప్ మోడల్ ఈ ఏవియేటర్. మరియు ఏవియేటర్‌లో ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ డిఎల్‌ఎక్స్ లో డిస్క్ బ్రేకులు మరియు హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్) ఇందులో కలదు.

            హోండా ఏవియేటర్ సాంకేతిక వివరాలు

            హోండా ఏవియేటర్ సాంకేతిక వివరాలు

            • ఇంజన్: 109సీసీ
            • పవర్ మరియు టార్క్: 8 బిహెచ్‌పి మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్
            • మైలేజ్: 66 కిలోమీటర్లు
            • సీటు ఎత్తు: 790 ఎమ్ఎమ్
            • ఆన్ రోడ్ ధర అందాసుగా: రూ. 58,000 లు
            • ఎంతో మంది వీటిని చదివారు మరి మీరు ....?
              • తెలంగాణ ప్రజలకు శుభవార్త: లైసెన్స్ లేకున్నా పర్వాలేదు
              • షార్ట్(పొట్టి) రైడర్స్ కోసం అతి ఉత్తమమైన స్కూటర్‌లు

Most Read Articles

English summary
Best Scooters For Tall Riders In India
Story first published: Tuesday, March 29, 2016, 18:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X