బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు

Written By:

బిఎమ్‌డబ్ల్యూ 500సీసీ సామర్థ్యం గల బైకులను తయారు చేయడానికి టీవీఎస్ తో చేతులు కలిపింది. అందుకు ఫలితంగా వచ్చే ఏడాదిలో అసంపూర్ణంగా నిర్మించబడిన జి310ఆర్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఇరు తయారీ సంస్థలు తక్కువ సామర్థ్యం గల చిన్న బైకుల రూపకల్పనకు సిద్దమయ్యాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న జి310ఆర్ కోసం ఇటు మార్కెట్ వర్గాలు అటు స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల ప్రేమికుల్లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దీని విడుదల అనంతరం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 125సీసీ సామర్థ్యం గల ఉత్పత్తులను అభివృద్ది చేయనున్నట్లు ఆధారం లేని వార్తలు కూడా వచ్చాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

తక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు వినియోగదారులను భారీ స్థాయిలో ఆకర్షిస్తాయి, చిన్న ఇంజన్‌లు ఉన్న బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా. అందుకు చక్కటి ఉదాహరణ ఇండియా.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

ఇంగ్లాండ్‌కు చెందిన ఎమ్‌సిఎన్ వార్తా వేదిక తెలిపిన వివరాల ప్రకారం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 300సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైకులను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

ముఖ్యంగా 125సీసీ సామర్థ్యం ఉన్న బైకును వచ్చే ఏడాది చివరి నాటికి అత్యవసరం ఉన్న కొన్ని ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

తక్కువ సీసీ సామర్థ్యం గల ఉత్పత్తుల తయారీ గురించి బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ప్రధానాధ్యక్షుడు స్టీఫెన్ షల్లర్ ను సంప్రదించగా, చిన్న బైకుల సెగ్మెంట్లో ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు సాధించడం ముఖ్య ఉద్ద్యేశం కాదని, చిన్న బైకులను కొనుగోలు చేసే వారికి జి310ఆర్ వంటి ఉత్పత్తులను చేరువ చేయడం మా వ్యూహం అని తెలిపాడు.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

కొత్త వినియోగదారులను సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ కు ఆకర్షితులం చేయడ కోసం ప్రయత్నిస్తున్నాం. అంతే గానీ 125సీసీ దాని కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను అభివృద్ది మరియు తయారు చేసే ఆలోచనలో బిఎమ్‌డబ్ల్యూ లేనట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్ మార్కెట్లోకి విడుదలైతే, దీని నాణ్యత, బ్రాండ్ పేరు, ఫీచర్లు మరియు ధర పరంగా 500సీసీ, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉత్పత్తులకు ఇది ప్రపంచ వ్యాప్తంగా గట్టి పోటీని ఇవ్వనుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

ప్రస్తుతం వస్తున్న ఆధారం లేని వార్తల ప్రకారం టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా 125సీసీ సామర్థ్యం ఉన్న చిన్న బైకులను ఉత్పత్తి చేస్తే మార్కెట్లో మంచి ఫలితాలను సాధిస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలకు చెందిన యమహా ఆర్125, డ్యూక్ 125, సుజుకి మరియు అప్రిలియాకు చెందిన 125సీసీ ఉత్పత్తులకు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఉత్పత్తులు మంచి పోటీని సృష్టించగలవు.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

యమహా ఆర్125, డ్యూక్ 125, సుజుకి మరియు అప్రిలియాకు చెందిన 125సీసీ ఉత్పత్తుల ధరలు లక్ష నుండి లక్షా యాభైవేల వరకు ఉంది. కాబట్టి బిఎమ్‌డబ్ల్యూ మరియు టీవీఎస్ భాగస్వామ్యంలో 125సీసీ సామర్థ్యం ఉన్న బైకులు అందుబాటులోకి ఈ ధరల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్

 
English summary
Read In Telugu: BMW Motorrad Might Launch A 125cc Bike After G 310R

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark