జిక్సర్ ఉత్పత్తులను ప్రత్యేక ఎడిషన్‌లో విడుదల చేసిన సుజుకి

By Anil

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ మోడళ్లకు స్పెషల్ ట్రీట్‌మెంట్ అందించి నేడు మార్కెట్లోకి విడుదల చేశారు. రెండు ఉత్పత్తులు కూడా ఎస్‌పి ఎడిషన్‌గా అందించారు. ఈ రెండింటిలో ప్రత్యేకమైన పెయింట్ జాబ్, విభిన్నమైన కస్టమైజేషన్‌లతో పాటు మరిన్ని మెరుగులు దిద్దారు.

ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

సుజుకి జిక్సర్ ఎస్‌పి ఎడిషన్‌ల ధరలు

  • జిక్సర్ ఎస్‌పి ధర రూ. 80,726 లు
  • జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి ధర రూ. 88,857 లు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
  • ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు అని చెప్పుకోవడానికి వీటిని విభిన్నమైన మట్టీ ఫైబ్రియన్ గ్రే విత్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ పెయింట్ జాజ్ కలదు. మరియు ప్రత్యేకమైన బ్లాక్ మరియు తెలుపు గళ్లు గల జెండా వంటి లోగో కలదు ఇందులో స్పెషల్ ఎడిషన్ చిహ్నం కూడా కలదు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    సుజుకి వారు ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి అందించిన జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి ఎడిషన్ రెండింటిలో కూడా ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఉన్న డ్యూయల్ టోన్ సీటు కలదు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    జిక్సర్ ఎస్‌పి ఎడిషన్‌లో వెనుక వైపున ఆప్షనల్ డిస్క్ బ్రేక్‌ను అందించారు. మరియు వెనుక వైపున గల బ్రేక్ లైటును మరింత స్పష్టమైన లెన్స్‌లు గల ఎల్‌ఇడి లైట్‌ను అందించారు. ఎర్రటి స్ట్రిప్స్‌తో పాటు నల్లటి రంగులో ఉన్న అల్లాయ్ వీల్స్ కలవు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    సాంకేతికంగా జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి వెర్షన్‌లలో అదే 155సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    ఈ రెండింటిలో కామన్‌గా ఉన్న ఇంజన్‌ 8000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 14.6బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వేగం వద్ద 14ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ను గుర్తుకు తెచ్చుకుంటే అందులో సుజుకి వారు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ గల జిక్సర్ ఎస్ఎఫ్‌ను పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ స్పెషల్ ఎడిషన్‌లో ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను అందించారు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    సస్పెన్షన్ పరంగా రెండింటిలో కూడా ముందు వైపున ట్విన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ కలవు మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    జిక్సర్ ప్రేమికులు గమనించాల్సింది ఏమిటంటే, ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గల జిక్సర్‌లను కేవలం కొన్ని ఎంచుకోదగ్గ నగరాలు మరియు డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అందులో కూడా మోటో జిపి ఎడిషన్‌లో మాత్రమే ఈ సరికొత్త ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నట్లు తెలిసింది.

    ప్రత్యేక ఎడిషన్‌లో సుజుకి జిక్సర్ ఉత్పత్తులు

    • విజయ్ మాల్యా పాపాలకు పరిహారం....!!
    • మీ కారులో ఏసి ని వినియోగిస్తున్నారా ?

Most Read Articles

English summary
Suzuki Launches Its Gixxer & Gixxer SF In An Unique SP Edition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X