పవణ్ కళ్యాణ్ నుండి నాని వరకు ప్రేమ కథలకు ప్రాణం పోసిన బైక్: యమహా ఆర్ఎక్స్

Written By:

ప్రేమ కథలు ఎన్నొచ్చినా తెరపై మరొక కథకు చోటు ఉంటుంది. ఈ ధైర్యంతోనే దర్శకుడు విరించి వర్మ గారు "మజ్ను" కథను రాసుకున్నట్లున్నాడు. కథకు తగ్గట్టుగానే నాని సహజ నటన మరియు కథానాయిక అభినయం బాగా కుదిరాయి.

మజ్ను సినిమాలోని కథ పరంగా పాత్రలు అన్నింటికి న్యాయం బాగానే చేసారు. అయితే ఒకానొక కాలం నాటి బైకు ఆర్ఎక్స్ 135 ను మాత్రం వదల్లేకపోయారు. ఎందుకంటే ఈ సినిమా విజయంలో ఈ బైకు పాత్ర కూడా చాలానే ఉంది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

టాలీవుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి చిత్రం ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో యమహా ఆర్ఎక్స్ బైకును వినియోగించాడు. సుమారుగా రెండు దశాబ్దాలు కాలం గడిచిపోయినా ప్రేమ కథల్లో ఆర్ఎక్స్ పాత్ర మాత్రం పోలేదు. అందుకే కాబోలు మజ్నులో కూడా యమహా ఆర్ఎక్స్ ను వినియోగించారు.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

న్యాచురల్ స్టార్‌‌ నాని ఈ సినిమాలోని పాత్రకు అచ్చంగా సరిపోయాడు, ఇంకా చెప్పాలంటే కథను మొత్తం తనే దగ్గరుండి నెట్టుకొచ్చాడు. దీనికి తోడు సుమారుగా ఓ పది పదిహేను సార్లు మోడిఫైడ్ ఆర్ఎక్స్ 135 బైకు ఎంతగానో ఆకర్షిస్తుంది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

మజ్ను సినిమాలో వినియోగించిన యమహా ఆర్ఎక్స్ 135 బైకును లేత నీలం రంగులో మోడిఫై చేశారు.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా ప్రారంభంలో 1990 లో ఇండియన్ మార్కెట్లోకి ఆర్ఎక్స్ శ్రేణిగా ఈ బైకును విడుదల చేసింది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

ఆగ్నేయాసిలో మంచి విజయాన్ని అందుకున్న ఈ బైకు 4-స్పీడ్ మరియు 5-స్పీడ్ ఆనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండేది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

యమహా తమ ఆర్ఎక్స్ 135 విడుదల చేయడానికి కారణమైన మొదటి ఆర్ఎక్స్‌ వేరియంట్‌‌ను మాత్రం 2-స్ట్రోక్ మరియు 4-స్ట్రోక్ ఇంజన్‌లతో పరిచయం చేసింది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

మజ్ను చిత్రంలో నాని వినియోగించిన బైకులో 132సీసీ సామర్థ్యం గల 2-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 7,500ఆర్‌పిఎమ్ వద్ద 14బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

ముందు మరియు వెనుక రెండు వైపులా 130ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులు కలవు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఆయిల్ డ్యాంప్ ఫ్రంట్ పోర్క్ మరియు వెనుక వైపున స్వింగ్ ఆర్మ్ మరియు హైడ్రాలిక్ అబ్సార్వర్లు కలవు.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

1990 లో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఆర్ఎక్స్ 135 ను 1997 నుండి 2005 వరకు దేశీయంగా ఉత్పత్తి చేశారు. అయితే యురో 3 ఉద్గార నియమాలను 2-స్ట్రోక్ వాహనాలు పాటించవు కాబట్టి వీటిని మార్కెట్ నుండి తొలగించింది.

మజ్నులో నాని ఉపయోగించిన యమహా ఆర్ఎక్స్135

ఎన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆ కాలం నాటి పాత డిజైన్ శైలి గల టూ వీలర్ల తీరే వేరని మజ్ను చిత్రంతో మరో సారి నిరూపించారు.

  
English summary
Read In Telugu: Yamaha Rx135 The Legendary Retro Model Used In Majnu Movie By Nani
Please Wait while comments are loading...

Latest Photos