బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 38,806 లు

Written By:

బజాజ్ సిటి100 మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో విపణిలోకి విడుదలయ్యింది. సరికొత్త బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్ అల్లాయ్ బైకు ధర రూ. 38,806 లు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.

బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

బజాజ్ సిటి100 ఇఎస్ అల్లాయ్ వేరియంట్ బజాజ్ సిటి100 లైనప్‌లో నాలుగవ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్ ఉన్న దీని ధర బేస్ వేరియంట్ సిటి100బి తో పోల్చుకుంటే 6,800 లు అధికంగా ఉంది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

బజాజ్ సిటి100 మోటార్ సైకిల్‌కు పల్లె ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది. అందులో కూడా 40 సంవత్సరాలు వయసున్న వారు అధికంగా దీనిని ఎంచుకుంటున్నారు. సులభంగా రైడ్ చేయడం, తక్కువ ఇంజన్ కెపాసిటి మరియు తక్కువ బరువు ఉండటంతో పెద్దలంతా దీనికే ఓటేశారు.

బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

కానీ కిక్కర్ స్టార్ట్ చేయడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండేది. అయితే బజాజ్ ఆటో తమ కమ్యూటర్ మోటార్ సైకిల్ సిటి100 లో ఎలక్ట్రిక్ స్టార్ట్ పరిచయం చేసి విపణిలోకి విడుదల చేసింది.

బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

సాకేతికంగా బజాజ్ సిటి100 ఇఎస్ అల్లాయ్ మోటార్ సైకిల్‌లో 99.27సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 8.08బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. 90కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకునే దీని మైలేజ్ లీటర్‌కు 90కిమీలుగా ఉంది.

బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

సిటి100 ఇఎస్ అల్లాయ్ మరియు సిటి100 రెగ్యులర్ అల్లాయ్ వేరియంట్‌కు మధ్య వ్యత్యాసాన్ని కనబరిచేందుకు, ఇందులో నూతన బాడీ డీకాల్స్, సరికొత్త ఫ్యూయల్ గేజ్, ఫ్లెక్సిబుల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. మరియు సిటి100 ఇఎస్ అల్లాయ్ వేరియంట్ ఫ్లేమ్ రెడ్ మరియు ఎబోని బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభించును.

బజాజ్ సిటి100 ఎలక్ట్రిక్ స్టార్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ తమ సిటి100 లైనప్‌లో అతి ముఖ్యమైన ఎలక్ట్రిక్ స్టార్ ఫీచర్ ప్రవేశపెట్టింది. తొలిసారి బైకు కొనుకునే వారికి మరియు సిటి100 లో కిక్ స్టార్ట్ ఫీచర్ ఇబ్బందిపెట్టే వారికి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్ జోడింపు వారికెంతో సహాయపడనుంది.

English summary
Read In Telugu: bajaj CT100 Electric Start Launched In India; Priced At Rs 38,806
Story first published: Thursday, August 24, 2017, 10:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark