బ్లాక్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లో విడుదలైన బజాజ్ డామినర్ 400

Written By:

బజాజ్ ఆటో గత ఏడాది చివరిలో విపణిలోకి విడుదల చేసిన డామినర్ 400 స్పోర్ట్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను ఇప్పుడు మరో సరికొత్త కలర్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టింది. మునుపు లభించే అన్ని రంగులతో పాటు సరికొత్త బ్లాక్ మ్యాట్ కలర్ ఫినిషింగ్‌లో ఎంచుకోవచ్చు.

బ్లాక్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లో బజాజ్ డామినర్ 400

ఏబిఎస్ మరియు నాన్ ఏబిఎస్ వేరియంట్లో లభించే డామినర్ 400 గతంలో మూన్ వైట్, మిడ్‌నైట్ బ్లూ, ట్విలైట్ ప్లమ్ వంటి రంగుల్లో మాత్రమే లభించేది. మ్యాట్ బ్లాక్ ఎడిషన్ నాన్ ఏబిఎస్ డామినర్ 400 ధర రూ. 1.41 లక్షలు మరియు ఏబిఎస్ డామినర్ 400 ధర రూ. 1.55 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

బ్లాక్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లో బజాజ్ డామినర్ 400

నూతన కలర్ ఆప్షన్ మినహాయిస్తే, డిజైన్ మరియు మెకానికల్‌ పరంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు. సాంకేతికంగా డామినర్ 400 లో 34.5బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 373.3సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు.

బ్లాక్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లో బజాజ్ డామినర్ 400

క్లాసిక్ మోటార్ సైకిల్ సామ్రాజ్యంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్‌కు పోటీగా బజాజ్ విన్నూత్న శైలిలో డామినర్ 400 ను విపణిలోకి తీసుకొచ్చింది. ఇందులో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్లిప్పర్ క్లచ్ మరియు డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Dominar 400 Matte Black Edition Launched In India
Story first published: Saturday, July 8, 2017, 15:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark