అర్బనైట్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలోకి బజాజ్

Written By:

స్వదేశీ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. వాహన పరిశ్రమలో టూ వీలర్లు మరియు త్రీ వీలర్లు తయారు చేస్తున్న బజాజ్ 2020 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

2020 నాటికి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు బజాజ్ మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బజాజ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

అర్బనైట్ అనే బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను బజాజ్ అభివృద్ది చేయనుంది. ఎలక్ట్రిక్ కార్లకు టెస్లా ఏలాగో అలాగే ఎలక్ట్రిక్ టూ వీలర్లకు అర్బనైట్ అనేది భవిష్యత్తులో దిగ్గజ ఎలక్ట్రిక్ టూ వీలర్ల బ్రాండ్‌గా నిలవనుందని రాజీవ్ బజాజ్ పేర్కొన్నాడు.

Recommended Video
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

ప్రస్తుతం ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల విభాగంలో తక్కువ ధరతో లభించే ఉత్పత్తుల కంటే అర్బనైట్ ఉత్పత్తులు చాలా విభిన్నంగా ఉండనున్నాయి. ప్రస్తుతం అమ్ముడయ్యే టూ వీలర్ల ప్రయాణ పరిధి చాలా తక్కువగా ఉంది, మరియు వీటి పర్ఫామెన్స్ కూడా తక్కువే. ఈ రెండు సవాళ్లను అధిగమించేలా అర్బనైట్ ఉత్పత్తులు ఉండనున్నాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

బజాజ్ ఆటోను మినహాయిస్తే, ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల పరిశ్రమలో హీరో ఎలక్ట్రిక్ గత పదేళ్ల కాలంగా మార్కెట్లో ఉంది. దేశవ్యాప్తంగా దీనికి 300 కు పైగా సేల్స్ మరియు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం కోసం ప్రత్యేక బ్రాండ్ పేరును ప్రకటించిన తొలి కంపెనీ బజాజ్ ఆటో. బజాజ్ మరియు అర్బనైట్ రెండు బజాజ్ ఆటో విభాగంలోనే ఉండనున్నాయి. అయితే ఒక విభాగంలో పెట్రోల్‌తో నడిచే ఉత్పత్తులు, మరో విభాగంలో విద్యుత్‌తో నడిచే ఉత్పత్తులు రానున్నాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

బజాజ్ ఆర్బనై బ్రాండ్ ఖరీదైన టూ వీలర్లతో పాటు త్రీ వీలర్లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెడ్డటం మీద దృష్టి సారిస్తోంది. అర్బనైట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ క్రింద ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు మరియు ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చే అవకాశం ఉంది.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

బజాజ్ అర్బనైట్ ఉత్పత్తి చేసే ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, పూనే ఆధారిత ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ టార్క్ మోటార్ సైకిల్స్ ఉత్పత్తి చేసిన టి6ఎక్స్ తో పోటీపడనుంది.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

అదే విధంగా బజాజ్ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్, బెంగళూరు ఆధారిత స్టార్టప్ సంస్థ అథర్ ఎనర్జీ తయారు చేసిన ఎస్340 స్కూటర్ నోరు మూయించనుంది.

బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటికే పలు దేశీయ టూ వీలర్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఈ విభాగానికి దూరంగా ఉన్న బజాజ్ ఇప్పుడు అర్బనైట్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉత్పత్తి చేస్తామంటూ తెలిపింది. దీంతో, అటు కన్వెన్షనల్ ఇంజన్ మరియు ఇటు ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లో దూసుకెళ్లనుంది.

English summary
Read In Telugu: Bajaj Looking To Enter Electric Vehicle Segment By 2020
Story first published: Thursday, September 14, 2017, 10:57 [IST]
Please Wait while comments are loading...

Latest Photos