ఏబిఎస్ ఫీచర్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ విడుదల: ధర మరియు పూర్తి వివరాలు

Written By:

బజాజ్ ఆటో తమ నెక్ట్డ్ స్ట్రీట్ ఫైటర్ ఎన్ఎస్200 బైకును యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ ప్రారంభ ధర రూ. 1.09 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ తమ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ వెర్షన్ బైకులో ముందు చక్రానికి సింగల్ ఛానల్ ఏబిఎస్(యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) అందివ్వడం జరిగింది. ఏబిఎస్ అప్‌డేట్‌తో పాటు బ్రేకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు 300ఎమ్ఎమ్ చుట్టుకొలత గల పెద్ద డిస్క్ బ్రేక్ జోడించింది.

Recommended Video - Watch Now!
[Telugu] Yamaha Launches Dark Night Variants - DriveSpark
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ ఎన్ఎస్200 ఏబిఎస్ బైకులను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో విక్రయాలకు సిద్దంగా ఉంచింది. మరియు దశల వారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంచనుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

సింగల్ ఛానల్ ఫ్రంట్ వీల్ ఏబిఎస్ ఉండటం ద్వారా సడెన్ బ్రేకులు వేసినపుడు వీల్ లాక్ అయ్యి స్కిడ్ అవ్వడాన్ని అరికట్టవచ్చు. ఏబిఎస్ జోడింపు మినహాయిస్తే బైకులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

డిజైన్ విషయానికి వస్తే, పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అదే అగ్రెసివ్ స్టైలింగ్, పదునైన హెడ్ ల్యాంప్ డిజైన్, కండలు తిరిగిన రూపాన్ని కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ డీకాల్స్, ఇంజన్ కౌల్, స్టెప్ అప్ సీట్ మరియు సిగ్నేచర్ పల్సర్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

సాంకేతికంగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ బైకులో 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ యూనిట్ గరిష్టంగా 23.17బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, వైల్డ్ రెడ్, మిరేజ్ వైట్ మరియు గ్రాఫైట్ బ్లాక్. సరికొత్త 2017 ఎడిషన్ బైకుల్లో ఇప్పుడు 200 బ్రాండింగ్ గల స్పోర్టివ్ డార్క్ డీకాల్స్‌తో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ విభాగాధిపతి ఎరిక్ వాస్ మాట్లాడుతూ, పల్సర్ ఎన్ఎస్200 బైకును ఏబిఎస్ వెర్షన్‌లో విడుదల చేయనుంది అధిక సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో, కస్టమర్ల కోరిక మేరకు ఏబిఎస్ టెక్నాలజీ గల ఎన్ఎస్200 బైకులను లాంచ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పల్సర్ ఎన్ఎస్ 200 మోటార్ సైకిల్ ఏబిఎస్ జోడించడాన్ని ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రమాదాకరమైన రహదారుల మీద బైక్ రైడింగ్ ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. అందులో అధిక ఇంజన్ కెపాసిటి గల బైకుల్లో ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరి.

ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్ సైకిల్‌కు ఉన్న ప్రధాన పోటీ టీవీఎస్ అపాచే 200 4వి మరియు యమహా ఎఫ్‌జడ్25. అయితే, ఈ రెండింటిలో యాంటిలాక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ రాలేదు.

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar NS200 ABS Launched In India; Priced At Rs 1.09 Lakh
Story first published: Friday, November 3, 2017, 11:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark