బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్ - 2,34,000 యూనిట్లు రోడ్డు మీదకు!

Written By:

కొత్త డిజైన్ భాషలో, వి-సిరీస్ అనే నూతన బ్రాండ్ పేరుతో ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక లోహంతో తయారు చేసిన బైకులను 125సీసీ మరియు 150సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ ఆప్షన్‌లలో విడుదల చేసింది. బజాజ్ వి12 మరియు వి15 సిరీస్ బైకులకు మార్కెట్లో ఏ మేరకు డిమాండ్ ఉందో, వీటి విక్రయాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ తొలుత వి15 బైకును ఫిబ్రవరి 2016 లో మార్కెట్లోకి విడుదల చేసింది. వి బ్రాండ్ పేరుతో వచ్చిన ఈ 150సీసీ మోటార్ సైకిల్ మంచి ఫలితాలు సాధించడంతో ఈ విజయానికి కొనసాగింపుగా 125సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో వి12 బైకును డిసెంబర్ 2016 లో విడుదల చేసింది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

విక్రయాల విశయానికి వస్తే ఏప్రిల్ 1, 2016 నుండి మార్చి 31, 2017 మధ్య కాలంలో వి12 మరియు వి15 రెండూ కలిపి 2,34,000 యూనిట్ల వరకు అమ్ముడుపోయాయి.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

కానీ ఇక్కడో ఆశక్తికర విషయం ఉంది. వి12 ను విడుదల చేస్తే అమ్మకాలు మరింత పెరుగాతాయని భావించింది బజాజ్. అయితే మొత్తం విక్రయాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా. వి12 బైకు రావడంతో వి15 విక్రయాలు దెబ్బతిన్నాయి.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

మార్చి 2016 మరియు ఆక్టోబర్ 2016 లో బజాజ్ వి15 సగటు విక్రయాలు 23,394 యూనిట్లుగా ఉండేవి. అయితే నవంబర్ 2016 మరియు మార్చి 2017 లో ఈ బైకు సగటు విక్రయాలు 7,900 యూనిట్లకు పడిపోయాయి.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ వి12 విడుదల చేసిన డిసెంబర్ 2016 లో సగటు విక్రయాలు 6,212 యూనిట్లుగా ఉన్నాయి. ఇప్పుడు రెండు బైకుల సగటు విక్రయాలు 14,000 యూనిట్లుగా ఉన్నాయి. గతంలో వి12 కాకముందు ప్రారంభంలో వి15 విక్రయాల కన్నా ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ వి సిరీస్ మోటార్ సైకిళ్ల విక్రయాలకు ప్రధాన కారణం స్వతంత్ర భారత దేశం యొక్క మొదటి యుద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ లోహంతో తయారుచేయబడటం. వి సిరీస్ బైకుల్లోని ఇంధన ట్యాంకులో ఐఎన్ఎస్ విక్రాంత్ లోహాన్ని వాడటం జరిగింది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ వి15 బైకు విడుదలైన కేవలం ఆరు నెలల్లో ఒక లక్ష బైకులు అమ్ముడుపోయాయి. దీంతో వి బ్రాండ్ మోటార్ సైకిళ్ల పట్ల వినియోగదారులు ఆసక్తికనబరుస్తున్నారని గ్రహించి వి15 కు కొనసాగింపుగా 12 ను విడుదల చేసింది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

ప్రారంభంలో వి15 కు మంచి డిమాండ్ వచ్చింది. అయితే వి12 విడుదలతో వి15 విక్రయాలు వి12 మీదకు మళ్లాయి. బజాజ్ వి15తో పోల్చుకుంటే వి12 ను ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ వి12 లో 124.50సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 10.60బిహెచ్‌పి పవర్ మరియు 10.98ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ప్రారంభ వేరియంట్ వి15 ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 67,125 లుగా ఉంది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ వి15 లో 149.50సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 11.80బిహెచ్‌పి పవర్ మరియు 13ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ప్రారంభ వేరియంట్ వి15 ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 74,013 లుగా ఉంది.

బజాజ్ వి బైకుల రికార్డ్ సేల్స్

బజాజ్ లైనప్‌లో ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి 180సీసీ, 200సీసీ రేంజ్ ఉన్న ఇంజన్‌లతో వి18 మరియు వి20 సిరీస్ లలో శక్తివంతమైన బైకులను విడుదల చేస్తే విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu Bajaj V15 V12 Sales Performance
Story first published: Thursday, May 25, 2017, 11:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark