రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోటీగా దూసుకొస్తున్న ఇటాలియన్ సంస్థ

Written By:

టూ వీలర్ల మార్కెట్లో ప్రతి చిన్న బైకు నుండి పెద్ద పెద్ద మోటార్ సైకిళ్ల వరకు ప్రతి మోడల్‌కు పోటీ ఉంటుంది. మరి, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు ఇప్పటి వరకు పోటీ లేదు. దీంతో గత దశాబ్ద కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ వృద్దిని సాధించింది.

బెనెల్లీ ఇంపిరియలె 400

అయితే, ఇక మీదట రాయల్ ఎన్ఫీల్డ్ విజయ పరంపర కొనసాగడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇటాలియన్ టూ వీలర్ల దిగ్గజం బెనెల్లీ రాయల్ ఎన్ఫీల్డ్‌కు సరాసరి పోటీనిచ్చే కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వాటిని ప్రపంచ విపణితో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా విడుదలకు సిద్దం చేస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్‌ క్లాసిక్ 350కు పోటీగా వస్తున్న బైకు గురించిన పూర్తి వివరాలు...

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
బెనెల్లీ ఇంపిరియలె 400

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు ఇప్పటి వరకు పోటీ రాలేదు. ఎందుకో తెలుసా...? డిజైన్ మరియు ఇంజన్ రెండు ప్రధాన అంశాలు. సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఆశించిన టెక్నాలజీని అభివృద్ది చేయలేకపోయినా... అయితే, పురాతణ డిజైన్ శైలి మరియు శక్తివంతమైన ఇంజన్ గల బైకులే రాయల్ ఎన్ఫీల్డ్‌ను కాపాడుతూ వచ్చాయి.

బెనెల్లీ ఇంపిరియలె 400

అయితే డిజైన్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌తో అచ్చం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పోలిన టూ వీలర్లను ఇటాలియన్ దిగ్గజం బెనెల్లీ అభివృద్ది చేసింది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

బెనెల్లీ ఇంపిరియలె 400

ఇటీవల ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద ఇంపిరియలె 400 అనే ఆల్ న్యూ రెట్రో స్టైల్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

బెనెల్లీ ఇంపిరియలె 400

గతంలో, బెనెల్లీ 300సీసీ నుండి 400సీసీ కెపాసిటితో ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను రివీల్ చేసింది. సరికొత్త మోడళ్లు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించనుంది.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను నాశనం చేస్తున్న పోలీసులు: పట్టుపడ్డారా... అంతే సంగతులు

అదృష్టం అంటే అనుష్క డ్రైవర్‌దే: ఆయనకు అదిరిపోయే కానుకిచ్చిన స్వీటి

40కిమీల మైలేజ్‌నిచ్చే వాటర్ బైకు సృష్టించిన 10 వ తరగతి స్టూడెంట్

బెనెల్లీ ఇంపిరియలె 400

బెనెల్లీ ఇంపిరియలె 400 విషయానికి వస్తే, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌కు సరాసరి పోటీనిచ్చేలా ఉంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మూడవ త్రైమాసికంలో విపణిలోకి విడుదల కానుంది.

బెనెల్లీ ఇంపిరియలె 400

బెనెల్లీ ఇంపిరియలె 400 డిజైన్ విషయానికి వస్తే, పాత కాలం నాటి రైడింగ్ పొజిషన్, గుండ్రటి ఆకారంలో ఉన్న క్లాసిక్ హెడ్ ల్యాంప్, ముందు మరియు వెనుక వైపున క్రోమ్ సొబగులు, స్పోక్ వీల్స్, డిజిటల్ డిస్ల్పే గల ట్విన్ పోడ్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, క్రోమ్ పూత పూయబడిన ఇంజన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ బైకు మొత్తానికి రెట్రో రూపాన్ని తీసుకొచ్చింది.

బెనెల్లీ ఇంపిరియలె 400

సాంకేతికంగా బెనెల్లీ ఇంపిరియలె 400 బైకులో 373.5సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 19బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ ఇంపిరియలె 400

అత్యుత్తమ సస్పెన్షన్ కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. సమర్థవంతమైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ముందు వైపు 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

బెనెల్లీ ఇంపిరియలె 400

బెనెల్లీ ఇంపిరియలె 400 బైకు బరువు మొత్తం 200కిలోలుగా ఉంది మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 12-లీటర్లుగా ఉంది. భద్రత పరంగా డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కలదు. క్రూయిజర్ బైకు తరహా ఇరువైపులా లగేజి బ్యాగులున్నాయి.

బెనెల్లీ ఇంపిరియలె 400

ఇండియన్ మార్కెట్లో బెనెల్లీ ఇంపిరియలె 400 బైకు రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ మోటార్ సైకిల్ నోరు మూయించడం ఖాయమనిపిస్తోంది. టెక్నాలజీ పరంగా పోల్చుకుంటే ఇంపిరియలె 400 బైకులో అతి ముఖ్యమైన ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు ఏబిఎస్ ఫీచర్లు ఉన్నాయి.

బెనెల్లీ ఇంపిరియలె 400

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెట్రో డిజైన్ విషయానికి వస్తే రెండు బైకు పోటాపోటీగా ఉన్నాయి. బెనెల్లీ ఇంపిరియలె 400లో ఎఫ్ఐ, ఏబిఎస్, శక్తివంతమైన ఇంజన్ ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా విక్రయ కేంద్రాల కొరత దీనికి ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి సర్వీసింగ్, విడిపరికరాల లభ్యత మరియు మెయింటెనెన్స్ వంటివి కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అత్యంత పోటీతత్వమైన ధరలో విడుదల చేస్తే భవిష్యత్ దీనిదే.

బెనెల్లీ ఇంపిరియలె 400

రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా అత్యుత్తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్, మరియు రెట్రో స్టైల్ సైకిళ్ల విపణిలో అపారమైన అనుభవం గడించింది. అయితే, ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల పట్ల సంతృప్తి గల కస్టమర్లు ఏ మేరకు ఉన్నారో అసంతృప్తి కస్టమర్లు కూడా అంతే మంది ఉన్నారు.

బెనెల్లీ ఇంపిరియలె 400 మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిళ్లలో ఏది బాగుంది. క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

English summary
Read In Telugu: Benelli To Launch Imperiale 400 In India; To Rival Royal Enfield Classic 350

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark