సైలెంటుగా పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ బైకును విడుదల చేసిన బజాజ్

Written By:

బజాజ్ ఆటో ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన టూ వీలర్లలో పల్సర్ తరువాత అత్యధిక ఆదరణ పొందుతున్న పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ ఎన్ఎస్200. పల్సర్ ఎన్ఎస్200 శక్తిసామర్థ్యాలు మరియు పనితీరు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అయినప్పటికీ ఇందులో ఉండాల్సిన అతి ముఖ్యమైన ఫీచర్ కరువైంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్ సైకిల్ ఇండియాలో ఇప్పటి వరకు ఏబిఎస్‌తో లభించలేదు. అయితే, ఇదే మోటార్ సైకిల్ వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో ఏబిఎస్ ఫీచర్‌తో విక్రయాల్లో ఉంది. కాబట్టి ఇండియన్ మార్కెట్లో కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఎన్ఎస్200 ను ఏబిఎస్‌తో నిశ్శబ్దంగా విపణిలోకి విడుదల చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఆధారం లేని కొన్ని వార్తల మేరకు, పల్సర్ ఎన్ఎస్200 సరికొత్త ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడా వచ్చినట్లు వార్తలున్నాయి. బైకు బాడీ మీద కూడా ఎఫ్ఐ అనే అక్షరాలను సూచించే డీకాల్స్ గల ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లుకొట్టాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో బజాజ్ టర్కీలో విడుదల చేసిన ఎన్ఎస్200 ఏబిఎస్ మరియు ఎఫ్ఐ వెర్షన్ బైకు ఫోటోలని తేలింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

పుకార్లకు ముగింపు పలుకుతూ, ఇండియాలో ఉన్న కొంత మంది బజాజ్ డీలర్లను సంప్రదించగా, బజాజ్ తమ ఎన్ఎస్200 బైకును ఏబిఎస్ ఫీచర్‌తో విడుదల చేయడం నిజమే అయినప్పటికీ, ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో రాలేదని స్పష్టం చేశారు. మరియు అదే మునుపటి కార్బోరేటర్ ఫ్యూయల్ సిస్టమ్‌ ఇందులో ఉన్నట్లు పేర్కొన్నారు.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

గతంలో బజాజ్ ఆర్ఎస్200 బైకులో పరిచయం చేసిన విధంగాపల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ ముందు చక్రానికి మాత్రమే సింగల్ ఛానల్ ఏబిఎస్‌గా అందివ్వడం జరిగింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

సింగల్ ఛానల్ ఏబిఎస్ అంటే, బైకులో ముందు లేదా వెనుక ఏదైనా ఒక చక్రానికి మాత్రమే ఏబిఎస్ అందివ్వడం. ఇలా చేయడంతో తక్కువ ధరలోనే తమ బైకులను విక్రయించడంతో పాటు భవిష్యత్తులో మిగిలిన చక్రానికి కూడా ఏబిఎస్ ఫిక్స్ చేసే అవకాశం కల్పిస్తోంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఏబిఎస్ జోడింపు మినహాయిస్తే, పల్సర్ ఎన్ఎస్ 200 బైకులో 199.5సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

డిజైన్ పరంగా చూడటానికి ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. అయితే ఏబిఎస్ ఫీచర్ ఉన్న బైకుల బాడీ మీద ఏబిఎస్ డీకాల్స్ వచ్చే అవకాశం ఉంది.

బుకింగ్స్:

దేశవ్యాప్తంగా ఎంచుకోదగిన కొన్ని డీలర్ల వద్ద మాత్రమే ఎన్ఎస్200 ఏబిఎస్ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా రెండు వారాల్లో ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలకు మీ దగ్గరలోని బజాజ్ షోరూమ్‌ను సంప్రదించండి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరా....?

బైకుల్లో అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ ఏబిఎస్. ఏబిఎస్ అనగా, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే. అధిక వేగం మీదున్నపుడు సడన్‌గా బ్రేకులు వేయడంతో చక్రాలు లాక్ అయిపోతాయి. దీంతో చక్రాలు జారి, క్రిందపడతారు. దీనిని నివారించడంలో ఏబిఎస్ అద్భుతంగా పనిచేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఏబిఎస్ ఏలా పనిచేస్తుంది..?

ఏబిఎస్‌ను బ్రేకు లేదా యాక్సిలరేటర్‌లా ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పనిలేదు. హై స్పీడులో ఉన్నపుడు సడన్ బ్రేకులు వేస్తే, టైర్లు స్కిడ్ అవ్వకుండా బైకు వేగాన్ని క్షణాల్లో తగ్గించి చక్రాలు జారకుండా చేస్తుంది. బ్రేకులు అప్లే చేసినపుడు ఏబిఎస్ ఆటోమేటిక్‌గా దానంతటం అదే యాక్టివేట్ అయిపోతుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ఏబిఎస్ ఫీచర్ ఉన్న ఇతర బైకులు....

ఇదే రేంజ్‌లో ఏబిఎస్ ఫీచర్ గల ఇతర బైకులు చూసుకుంటే, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో సింగల్ ఛానల్ మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైకులో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కలదు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

ధర పరంగా చూస్తే, హైదరాబాదులో పల్సర్ ఎన్ఎస్200 స్టాండర్డ్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,777 లు మరియు ఆన్ రోడ్ ధర రూ. 1,09,940 లుగా ఉంది. అయితే ఏబిఎస్ వెర్షన్‌తో వస్తున్న ఏబిఎస్ ధర రూ. 15,000 లు అదనంగా ఉండే అవకాశం ఉంది. జిక్సర్ ఎస్ఎఫ్ ఏబిఎస్ కార్బోరేటర్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 95,599 లు మరియు రూ. 99,312 లుగా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో స్పోర్ట్స్ మరియు రేసింగ్ బైకుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి తోడు 2019 ఏప్రిల్ నుండి 125సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల్లో ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరిగా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని బజాజ్ తమ పల్సర్ ఎన్ఎస్200 బైకులో ఏబిఎస్ అందించింది. అయితే జిక్సర్‌తో పోల్చుకుంటే పదివేల రుపాయల వరకు ధర అధికంగా ఉన్నట్లు అనిపించినా... జిక్సర్(155సీసీ) కన్నా ఎన్ఎస్200(199సీసీ) అత్యంత శక్తివంతమైనది.

కాబట్టి ఏబిఎస్‍‌‌ ఫీచర్‌తో సరసమైన మరియు పవర్‌ఫుల్ బైకును ఎంచుకోవాలనుకునే వారికి ఎన్ఎస్200 అత్యుత్తమ ఎంపిక అని మా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి...? ఏబిఎస్ ఫీచర్ ఉన్న పల్సర్ ఎన్‌ఎస్200, జిక్సర్ ఎస్ఎఫ్ మరియు అపాచే ఆర్‌టిఆర్180లలో ఏది బెస్ట్ ? క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: Bookings Open For Bajaj Pulsar NS200 Equipped With ABS, Bajaj Launched Pulsar NS200 in ABS Version.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark