హ్యార్లీ నుండి సాఫ్టెయిల్ బైకులు విడుదల: గరిష్ట ధర రూ. 18.99 లక్షలు

హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్లోకి 2018 సాప్టెయిల్ శ్రేణి బైకులను విడుదల చేసింది. హ్లార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకుల ధరల శ్రేణి రూ. 11.99 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)తో ప్రారంభమవుతుంది.

By Anil

హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్లోకి 2018 సాప్టెయిల్ శ్రేణి బైకులను విడుదల చేసింది. హ్లార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకుల ధరల శ్రేణి రూ. 11.99 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)తో ప్రారంభమవుతుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

2018 సాఫ్టెయిల్ శ్రేణిలో ఫ్యాట్ బాయ్(Fat Boy), ఫ్యాట్ బాబ్(Fat Bob), స్ట్రీట్ బాబ్(Street Bob) మరియు హెరిటేజ్ సాఫ్టెయిల్ క్లాసిక్(Heritage Softail Classic) బైకులు ఉన్నాయి. దేశీయ విపణిలోకి విడుదలైన ఈ బైకులను మిల్వాకీ ఎయిట్ ఇంజన్‌ మరియు సరికొత్త ఛాసిస్ మీద నిర్మించబడ్డాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

2018 హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకుల ధరల శ్రేణి

2018 Harley-Davidson Softail Range Price
Street Bob Rs 11.99 Lakh
Fat Bob Rs 13.99 Lakh
Fat Boy Rs 17.49 Lakh
Heritage Softail Classic Rs 18.99 Lakh

Recommended Video

Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

ఫ్యాట్ బాబ్ మరియు స్ట్రీట్ బాబ్ బైకుల్లో మిల్వాకీ ఎయిక్ 107 ఇంజన్ మరియు హెరిటేజ్ సాఫ్టెయిల్ క్లాసిక్ బైకులో మిల్వాకీ ఎయిట్ 114 ఇంజన్ కలదు.

2018 హ్యార్లీ సాఫ్టెయిల్ బైకుల్లో సరికొత్త ఫ్రంట్ సస్పెన్షన్ మరియు అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్, అదే విధంగా డ్యూయల్ బెండింగ్ వాల్వ్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను టూరింగ్ రేంజ్ నుండి సేకరించి ఇందులో అందివ్వడం జరిగింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

సాఫ్టెయిల్ శ్రేణిలో గల అన్ని బైకులను నూతన ఛాసిస్ మీద నిర్మించారు. దీంతో బరువు 15 కిలోల వరకు తగ్గడం, అత్యుత్తమ హ్యాండ్లింగ్, బెటర్ రైడింగ్ మరియు తక్కువ వైబ్రేషన్స్ సాధ్యమయ్యాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

హ్యార్లీ సాఫ్టెయిల్ బైకుల్లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, డిజైన్ పరంగా స్వల్పంగా మార్పులు జరిగాయి. అయితే, 2018 హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ బైకులో చాలా మోడిఫికేషన్స్ చోటు చేసుకున్నాయి. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫేస్ మరియు విభిన్నమైన హారిజంటర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలదు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

2018 స్ట్రీట్ బాబ్ బైకులో సరికొత్త డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్ బ్లాక్ థీమ్ బాడీ పెయింట్, కొత్త డిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది 8 కిలోల వరకు తక్కువ బరువు కలిగి ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

2018 హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్ విషయానికి వస్తే, మునుపటి వేరియంట్ కన్నా చాలా ధృడంగా, తేలికగా కొత్త ఛాసిస్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. స్టైలిష్ ఫీల్ కలిగించే నూతన వీల్ రిమ్స్, ఎల్ఇడి ఫార్వర్డ్ లైట్లు, సాలిడ్ డిస్క్ లేక్‌స్టర్ వీల్స్, 18.9-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

అయితే, హెరిటేజ్ సాఫ్టెయిల్ క్లాసిక్ బైకును మాత్రం టూరింగ్ అవసరాల కోసం నిర్మించింది. ఇందులోవాటర్ ఫ్రూఫ్ లాకర్స్, హార్డ్ ప్యానీయర్స్, తొలగించే వీలున్న విండ్ స్క్రీన్ మరియు ఎక్కువ లోడ్ తట్టుకోగల సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

2018 మిల్వాకీ ఎయిట్ సిరీస్ ఇంజన్‌ల విషయానికి వస్తే, 2018 సాఫ్టెయిల్ రేంజ్‌లో 1750సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. గరిష్టంగా 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఇది 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని మునుపటి మోడల్ కంటే వేగంగా అందుకుంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్టెయిల్ రేంజ్ బైకుల్లో జరిగిన అతి పెద్ద మిల్వాకీ ఎయిట్ ఇంజన్ మరియు నూతన ఛాసిస్ రావడం. టెక్నికల్‌గా జరిగిన మార్పులతో మునుపటి వేరియంట్లతో పోల్చుకుంటే అత్యుత్త రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ వీటితో సాధ్యమవుతుంది.

అయితే, ధర భారం కాదనుకునే వారికి ఇవి మంచి ఎంపికే...!!

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Harley-Davidson Softail Range Launched In India; Prices Start At Rs 11.99 Lakh
Story first published: Thursday, October 12, 2017, 18:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X