హీరో నుండి 200సీసీ బైక్: పూర్తి విడుదల వివరాలు

Written By:

భారత దేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 200సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి తమ తొలి బైకును విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది.

హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో మోటోకార్ప్ ఈ నెలలోనే 200సీసీ కెపాసిటి గల మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించిన ఎక్ట్స్రీమ్ 200 ఎస్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

హీరో ఎక్ట్స్రీమ్ 200ఎస్ బైకును ఇదే పేరుతో కాకుండా సరికొత్త బ్రాండ్ పేరుతో 200సీసీ ఇంజన్‌తో 2018 ప్రారంభం నాటికి విడుదల చేయనున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే వచ్చే సంవత్సరం కాకుండా ఈ యేడు అతి త్వరలో విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

200సీసీ బైకు డిజైన్ పరంగా ఎక్ట్స్రీమ్ 150 సీసీ బైకునే పోలి ఉండనుంది. ఎక్ట్స్రీమ్ శ్రేణిలో ఉన్న 150సీసీ మోటార్ సైకిల్‌లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, హెడ్ ల్యాంప్ డిజైన్, యథావిదిగా రానున్నాయి. అయితే, స్పోర్టివ్ ఫీల్ కలిగించేలా ట్యాంక్ మీద మరియు ప్రక్కవైపుల అదనపు డీకాల్స్ జోడించనుంది.

హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

హీర్ అప్‌కమింగ్ 200 మోటార్ సైకిల్‌లో 200సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే రానుంది, ఇంజన్ వేడిని కంట్రోల్ చేయడానికి ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో కూడా లభించనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 18బిహెచ్‌పి పవర్ మరియు 17ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

హీరో 200సీసీ బైకులో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు రానున్నాయి. అయితే, ప్రస్తుతం 200సీసీ సెగ్మెంట్లో ఇతర బైకులతో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు తమ బైకులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందిస్తుందా... లేదా... వేచి చూడాలి మరి.

హీరో మోటోకార్ప్ 200సీసీ మోటార్ సైకిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అతి త్వరలో 200సీసీ సెగ్మెంట్లోకి హీరో విడుదల చేయనున్న బైకును రూ. 90,000 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి వంటి బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Hero 200cc Motorcycle India Launch Details Revealed
Story first published: Friday, September 1, 2017, 16:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark