TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వెస్పా, ఫ్యాసినో స్కూటర్లకు పోటీగా హీరో నుండి సరికొత్త 125సీసీ స్కూటర్
భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే ప్యాసన్ ఎక్స్‌ప్రో బైకును విడుదలకు సిద్దం చేసిందని డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇది వరకే ఓ కథనాన్ని ప్రచురించింది.
తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో మోటోకార్ప్ సరికొత్త 125సీసీ స్కూటర్‌ను డిసెంబర్ 18, 2017 న మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. సరికొత్త హీరో స్కూటర్ పియాజియో వెస్పా మరియు యమహా ఫ్యాసినో స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.
ఇండియాలో తక్కువ కెపాసిటి గల బైకుల మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే, స్కూటర్ల విషయానికి వస్తే హోండా, టీవీఎస్ మరియు సుజుకి వరుసగా అగ్ర స్థానంలో ఉన్నాయి. స్కూటర్ల సెగ్మెంట్లో ఎలాగైనా రాణించేందుకు కొత్త స్కూటర్లను ప్రవేశపెట్టడానికి హీరో ఆసక్తికనబరుస్తోంది.
హీరో 125సీసీ స్కూటర్ రెట్రో స్టైల్ డిజైన్‌లో రానుంది. హీరో వారి అప్ కమింగ్ స్కూటర్ పట్టణ ప్రాంత యువ కొనుగోలుదారులను టార్గెట్ చేయనుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఎడ్జ్, డ్యూయెట్ మరియు ప్లెజర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది.
హీరో మోటోకార్ప్ అప్ కమింగ్ 125సీసీ స్కూటర్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే, ధర విషయానికి వస్తే, వెస్పా మరియు ఆక్టివా వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చే ధరతో విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
హీరో 125సీసీ స్కూటర్ ఒక యూనిసెక్స్ స్కూటర్. ఇది అబ్బాయిలు మరియు అమ్మాయిలకు బాగా మ్యాచ్ అవుతుంది. యువతను అట్రాక్ట్ చేయడానికి అధునాతన ఫీచర్లను హీరో ఇందులో జోడించింది. స్కూటర్ సెగ్మెంట్లో ఎలాగైనా విజయాన్ని అందుకునేందుకు ఢిల్లీకి చెందిన హీరో మార్కెట్లో గేమ్ చేంజర్ అని అంటోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బైకుల మార్కెట్లో తిరుగులేని సక్సెస్ అందుకున్న హీరో మోటోకార్ప్ ఇప్పుడు స్కూటర్ల సెగ్మెంట్లో కొత్త స్కూటర్లతో ఎక్కువ మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. సరికొత్త 125 స్కూటర్ హీరోకు అతి ప్రధానమైన మోడల్‌గా నిలవనుంది. దీని ధర అంచనాగా రూ. 60,000 లుగా ఉండే అవకాశం ఉంది.