హీరో టూ వీలర్ల మీద పెరుగుతున్న ధరలు

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అన్ని మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్ల మీద జనవరి 2018 నుండి ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

By Anil

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అన్ని మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్ల మీద జనవరి 2018 నుండి ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

హీరో టూ వీలర్ల ధరలు

హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఉన్న అన్ని మోడళ్ల ధరలు తప్పకుండా పెరగనున్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో ధరలు పెంపు అనివార్యమైందని హీరో తెలిపింది. సవరణ అనంతరం కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి అమల్లోకిరానున్నాయి.

Recommended Video

Three Women Wearing Sarees Ride A Yamaha R15 In Hyderabad; Video Goes Viral
హీరో టూ వీలర్ల ధరలు

ప్రస్తుతం, హీరో మోటోకార్ప్ హెచ్ఎఫ్ డీలక్స్(బైక్) మరియు ప్లెజర్(స్కూటర్) వంటి ఎంట్రీ లెవల్ మోడళ్ల నుండి కరిజ్మా జడ్ఎమ్ఆర్ వంటి బైకులను విక్రయిస్తోంది. వీటి ధరలు 43,316 రుపాయల నుండి 1.07 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హీరో టూ వీలర్ల ధరలు

హీరో మోటోకార్ప్ న్యూ రేంజ్ కమ్యూటర్ మోటార్ సైకిళ్లను తాజాగా ఆవిష్కరించింది. ప్యాసన్ ప్రో, ప్యాసన్ ఎక్స్‌ప్రో మరియు సూపర్ స్ల్పెండర్ మోడళ్లను నూతన ఫీచర్లు మరియు కొత్త డిజైన్ ఎలిమెంట్లతో అప్‌డేట్ చేసింది.

హీరో టూ వీలర్ల ధరలు

2018 జనవరిలో హీరో మోటోకార్ప్ ఈ నూతన ప్యాసన్ ప్రో, ప్యాసన్ ఎక్స్‌ప్రో మరియు సూపర్ స్ల్పెండర్ బైకులను లాంచ్ చేయనుంది. వీటి ధరలను కూడా జనవరిలోనే వెల్లడించింది. ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో 2018 నుండి ధరల పెంపు చేపడతున్నట్లు ప్రకటించిన తొలిం కంపెనీ ఇదే.

హీరో టూ వీలర్ల ధరలు

ప్యాసింజర్ కార్ల విపణిలో దిగ్గజ సంస్థలైన మహీంద్రా, స్కోడా, ఫోర్డ్, జీప్, వోక్స్‌వ్యాగన్, నిస్సాన్, టాటా మోటార్స్, ఇసుజు, హ్యుందాయ్, హోండా మోటార్స్ మరియు టయోటా వంటి పలు కంపెనీలు జనవరి 2018 నుండి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించాయి.

హీరో టూ వీలర్ల ధరలు

హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, "ధరల పెంపు కొనుగోలుదారుల మీద భారం పడకుండా ఒక్కో మోడల్ మీద కేవలం రూ. 4,00 లు మాత్రమే పెంచుతున్నట్లు వెల్లడించింది. వివిధ వేరియంట్ల ఆధారంగా ఇందులో వ్యత్యాసం ఉంటుందని తెలిపింది." కార్ల కంపెనీల తరహాలో ఇతర టూ వీలర్ల కంపెనీలు కూడా తమ ధరల పెంపు నిర్ణయాన్ని రానున్న రోజుల్లో ప్రకటించనున్నాయి.

హీరో టూ వీలర్ల ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ టూ వీలర్ల మార్కెట్లో హీరో మోటోకార్ప్ కమ్యూటర్ సెగ్మెంట్ లీడర్‌‍గా రాణిస్తోంది. జనవరి 1, 2018 నుండి అమల్లోకి రానున్న ధరలు స్వల్పంగా ఉంది కాబట్టి, ఈ నిర్ణయం విక్రయాల మీద ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. హీరో అతి త్వరలో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ విడుదలతో పర్ఫామెన్స్ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Hero MotoCorp To Increase Prices Across The Range From 2018
Story first published: Friday, December 22, 2017, 17:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X