తెలంగాణ మహిళా పోలీసులకు స్కూటర్లను బహుకరించిన హీరో మోటోకార్ప్
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తెలంగాణ మహిళా పోలీసులకు స్కూటర్లను బహుకరించింది.
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తెలంగాణ మహిళా పోలీసులకు స్కూటర్లను బహుకరించింది. మహిళా సాధికారతను పెంచేందుకు గాను హీరో మోటోకార్ప్ తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు ఉద్యోగుల కోసం 150కి పైగా స్కూటర్లను తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అందజేసింది.

నగరంలో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల ఉద్యోగుల రక్షణ కోసం స్కూటర్లను ప్రధానం చేసినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. పెట్రోలింగ్ నిర్వహించడానికి వీలుగా ఈ స్కూటర్లలో సైరన్లు, ట్రాఫిక్ లైట్లు మరియు చిన్న పాటి మైకులను అమర్చి అందజేయడం జరిగింది.
Recommended Video


హీరో మోటోకార్ప్ సిఐఒ మరియు సిఎస్ఆర్ విభాగాదిపతి విజయ్ సేతి గారు, కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ మహేందర్ రెడ్డికి 70 స్కూటర్లు, కమీషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సందీప్ షండీయాలాకు 50 స్కూటర్లు మరియు రాచకొండ పోలీస్ కమీషనర్ మషేష్ ఎమ్ భగవత్ చేతికి 39 స్కూటర్లను అందజేశారు.



Click it and Unblock the Notifications








