బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్!

హీరో మోటోకార్ప్ బైక్ ట్యాక్సీ సేవలందించే మార్కెట్లోకి ప్రవేశించడానికి దిగ్గజ ప్రజారవాణా సంస్థ ఉబర్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రవాణా మరియు తయారీ రంగాల మధ్య ఇదో పెద్ద డీల్ అనిచెప్పవచ్చు.

By Anil

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఉబర్ సంస్థతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందానికి చెందిన చర్చలు తొలి దశలో ఉన్నట్లు తెలిసింది. దేశీయ టూ వీలర్ ట్యాక్సీ మార్కెట్‌ను లక్ష్యం చేసుకుని ఈ ఒప్పందం జరగనుంది.

బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్

ట్యాక్సీ సర్వీసులందించే ఉబర్‌తో హీరో మోటోకార్ప్ చేతులు కలిపేందుకు తీసుకుంటున్న చర్యలు మరియు చర్చలు ఇంకా మొదటి దశలో ఉన్నట్లు తెలిసింది. రెండు సంస్థలు కూడా భాగస్వామ్యంతో దేశీయ టూ వీలర్ ట్యాక్సీ మార్కెట్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పవన్ ముంజవల్ బైకు ట్యాక్సీ రంగంలో ఇప్పటికే పెద్ద మొత్తంలోపెట్టుబడులు పెట్టారు. ఇక ఉబర్ విషయానికి వస్తే, అమెరికా తర్వాత ఉబర్‌కు ఇండియా రెండవ ముఖ్యమైన దేశం.

బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ మరియు ఉబర్ సంస్థలు అవగాహనతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థల యొక్క వ్యాపారాలు జోరందుకునే అవకాశం ఉంది.

బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్

ఈ ఒప్పందానికి సంభందించి ఎకనామిక్ టైమ్స్ వెబ్‌సైట్ ఇ-మెయిల్ ద్వారా ఇరు సంస్థలను సంప్రదిస్తే, ఉబర్ స్పందించలేదు. అయితే హీరో మోటోకార్ప్ స్పందించడానికి నిరాకరించింది. ఈ ఒప్పందం యొక్క వివరాలు వెల్లడైతే డ్రైవ్‌స్పార్త్ తెలుగు అప్‌డేట్ చేస్తుంది.

బైక్ ట్యాక్సీ బిజినెస్ మీద కన్నేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్, దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. కమ్యూటర్ బైకుల మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది.

.

వేలంలో 10 లక్షలకు అమ్ముడైన జనతా గ్యారేజ్ బైకు

విమానంలో మీకు ఖచ్చితంగా తెలియని పది రహస్యాలు

2017 స్విఫ్ట్ విషయంలో ఖచ్చితంగా నమ్మితీరాల్సిన వార్త

Most Read Articles

English summary
Hero MotoCorp Eyeing Alliance With Uber?
Story first published: Wednesday, March 8, 2017, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X