జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

Written By:

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2020 ఏప్రిల్ నాటికి బిఎస్-6 టూ వీలర్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, భవిష్యత్ రవాణాలో ఉద్గార రహిత వెహికల్స్ కీలకంగా మారనున్నాయి. అందుకోసం ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఆవిష్కరించనుంది.

జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

హీరో మోటోకార్ప్ గత ఏడాది బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ అథర్ ఎనర్జీలో సుమారుగా రూ. 205 కోట్ల రుపాయల వరికు పెట్టబడులు పెట్టింది. అథర్ ఎనర్జీ ఇప్పటికే జీరో ఎమిషన్ టూ వీలర్ల అభివృద్దిని ప్రారంభించింది.

జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

అంతకు మునుపు 2014 మరియు 2016 సంవత్సరాల్లో జరిగిన ఆటో ఎక్స్ పో వేదికల మీద హీరో మోటోకార్ప్ కొన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఆవిష్కరించింది. డ్యూయెట్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ శ్రేణిలో డ్యూయెట్-ఇ అనే పేరుతో ప్రదర్శించింది.

జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

హీరో మోటోకార్ప్ ఆర్ అండ్ డి బృందం డ్యూయెట్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 5kWh బ్రష్‌లెస్ డిసి మోటార్ అందించింది. దీని మీద తదుపరి మరిన్ని ప్రయోగాలు చేస్తోంది హీరో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం.

జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

హీరో లీఫ్ టూ వీలర్‌ను కూడా ప్రదర్శించింది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ స్కూటర్‌గా నిలవనుంది. ఇందులో హీరో అందిస్తున్న 124సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ మరియు 8kWh సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ నుండి పవర్ ఉత్పత్తి అవుతుంది.

జీరో ఎమిషన్ వెహికల్స్‌పై హీరో దృష్టి

2020 నాటికి అనేక ఎలక్ట్రిక్ టూ వీలర్లను విపణిలోకి ప్రవేశపెట్టి, 2020 ఏప్రిల్ నాటికి బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను ముందస్తుగా అభివృద్ది చేసుకునే ప్రణాళికల్లో ఉంది. మరియు ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి 50 దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలనే ఆలోచనలో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు అభివృద్ది మీద దృష్టిసారిస్తున్నాయి. కాని టూ వీలర్ల కంపెనీలలో కేవలం కొన్ని మాత్రమే ఎలక్ట్రిక్ బైకుల మీద దృష్టి పెడుతున్నాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లో పూర్తి స్థాయిలో రాణించేందుకు హీరో చక్కటి ప్రణాళికల్లో ఉందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu Hero MotoCorp Working On Zero Emission Vehicles – Report
Story first published: Saturday, June 17, 2017, 12:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark