డిసెంబర్ 18 న హీరో నుండి సరికొత్త ప్యాసన్ ఎక్స్‌ప్రో

Written By:

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో మోటోకార్ప్, సరికొత్త ప్యాషన్ ప్రొ బైకును ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 పేరుతో లాంచ్ చేయనుంది. దీని విడుదల డిసెంబర్ 18, 2017 న ఉండనుంది. నూతన ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

ఇంజన్ స్పెసిఫికేషన్స్

హీరో మోటోకార్ప్ ప్రస్తుతం విక్రయిస్తున్న ప్యాసన్ ప్రొ ఎంట్రీ లెవల్ బైకులో 97.2సీసీ ఇంజన్ కలదు. అయితే, ప్రస్తుతం విడుదల చేస్తున్న బైకులో 110సీసీ ఇంజన్‌ను అందిస్తోంది.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

ఎక్కువ ఇంజన్ సామర్థ్యం గల ప్యాసన్ ఎక్స్‌ప్రో 100 బైకు 9.3బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. హీరో లైనప్‌లో ఉన్న సూపర్ స్ల్పెండర్ బైకులో కూడా ఇదే ఇంజన్ ఉంది.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

ఫీచర్లు

సరికొత్త హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో లో ఐస్మార్ట్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ కలదు. ఇది ఇంజన్ ఐడిల్‌గా ఉన్నపుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది, క్లచ్ ప్రెస్ చేస్తే మళ్లీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ కొత్త వేరియంట్ గతంలో మార్కెట్ నుండి వైదొలగిన ఎక్స్‌ప్రో స్థానాన్ని భర్తీ చేయనుంది.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

డిజైన్

డిజైన్ పరంగా ప్యానస్ శ్రేణి బైకులన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి. నూతన ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 కూడా రెగ్యులర్ వెర్షన్ ప్యాసన్ ప్రో 100 బైకును పోలి ఉంటుంది. మరియు స్ల్పెండర్ 110 లో ఉన్న అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో వచ్చింది. మిగతా విడి భాగాలన్నింటిలో ఎలాంటి మార్పులు జరగలేదు.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

ధర

సరికొత్త ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 బైకులో ఐస్మార్ట్ టెక్నాలజీ అందివ్వడంతో 100సీసీ ప్యాసన్ మోటార్ సైకిల్‌తో పోల్చుకుంటే అత్యుత్తమ మైలేజ్ ఇవ్వనుంది. హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 57,000 ల ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

హీరో మోటోకార్ప్ 2018 ఏడాది నుండి సరికొత్త టూ వీలర్లను మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే మొదటి మోడల్‌గా హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110 బైకును లాంచ్ చేయనుంది. దీని తరువాత ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు హోండా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివాకు పోటీగా 125సీసీ స్కూటర్‌ను విడుదల చేయనుంది.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో 110

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థగా హీరో మొదటి స్థానంలో నిలవడానికి ప్యాసన్ మరియు స్ల్పెండర్ మోడళ్లు ఎంతో కీలకం. అందుకే ఈ రెండింటి శ్రేణిలో మరిన్ని కొత్త మోడళ్లను ఆవిష్కరించి విక్రయాలను పెంచుకోవాలని చూస్తోంది హీరో.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి విపణిలోకి కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసి, జపాన్ దిగ్గజాల నుండి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu: All You Need To Know About The New Hero Passion XPro 110
Story first published: Saturday, November 18, 2017, 19:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark