హీరో Xtreme 200S తొలి ఆవిష్కరణ ఖరారు

Written By:

భారతదేశపు దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ సరికొత్త 200సీసీ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఎక్స్‌ట్రీమ్ 200సీసీ బైకును వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

తాజాగా అందిన సమాచారం మేరకు, ఎక్స్‌మట్రీమ్200తో పాటు, డిసెంబర్ 18, 2017 న సరికొత్త 125సీసీ స్కూటర్ మరియు 110సీసీ కెపాసిటి గల ప్యాసన్ ఎక్స్‌ప్రో టూ వీలర్ల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

ఇండియన్ మార్కెట్లో తక్కువ కెపాసిటి గల టూ వీలర్ల సెగ్మెంట్లో ప్యాసన్ మరియు స్ల్పెండర్ వంటి మోడళ్లతో హీరో మోటోకార్ప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే, పవర్ ఫుల్ మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే ఒక్క బైకు కూడా లేదు. కానీ, ఇక మీదట పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల విపణిలోకి కూడా హీరో ప్రవేశించనుంది.

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకును కాన్సెప్ట్ వెర్షన్‌లో ప్రదర్శించిన హీరో మోటోకార్ప్ ఇప్పుడు 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోడళ్లను ఆవిష్కరించనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

ప్రస్తుతం విపణిలో ఉన్న ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి హీరో సుముఖంగా ఉంది. అందులో భాగంగానే ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ను సిద్దం చేసింది. దీనితో పాటు ఫుల్లీ ఫెయిర్డ్ హెచ్ఎక్స్250 మరియు ఎక్కువ కెపాసిటి గల ఎక్స్ఎఫ్3ఆర్ కాన్సెప్ట్ మోడళ్లను కూడా అభివృద్ది చేసింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌ను డైమండ్ టైప్ ఫ్రేమ్ మీద నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకుగా నిర్మించింది. ఇందులో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానున్న ఇది 18.2బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

డిజైన్ విషయానికి వస్తే, 150సీసీ కెపాసిటి గల ఎక్స్‌స్ట్రీమ్‌ను పోలి ఉండే అగ్రెసివ్ డిజైన్ శైలి దీని సొంతం. కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, చిన్న పరిమాణం ఆకర్షణీయంగా ఉన్నపగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, స్టెప్ అప్ సీటు, అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పదునైన టెయిల్ ల్యాంప్ సెక్షన్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్‌తో బైకు మొత్తం ప్రీమియమ్ లుక్ సొంతం చేసుకుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాల వద్ద డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా పరిచయం చేసే అవకాశం ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్‌కు ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ అత్యంత ముఖ్యమైన మోడల్. 200సీసీ సెగ్మెంట్లో ప్రీమియమ్ పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల సరసన చేరనుంది. మార్చి 2018 నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 90,000 ల నుండి రూ. 1,10,000 ల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

అయితే, ఏబిఎస్ ఫీచర్‌తో ధరకు తగ్గ విలువలతో విడుదలైతే, విపణిలో ఇప్పటికే ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్200 4వి మరియు యమహా ఎఫ్‌జడ్25 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఎక్కువ మంది చదువుతున్నవి...

టాటా నుండి వస్తున్న పది కొత్త కార్లు మరియు ఎస్‌యూవీలు

వెస్పా, ఫ్యాసినో స్కూటర్లకు పోటీగా హీరో నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

డిసెంబర్ 18 న విపణిలోకి హీరో నుండి సరికొత్త ప్యాసన్ ఎక్స్‌ప్రో

English summary
Read In Telugu: Hero Xtreme 200S India Debut Date Revealed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark