MSX125 బైకును పరీక్షిస్తున్న హోండా టూ వీలర్స్

Written By:

జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా టూ వీలర్ల విపణిలో సరికొత్త సెగ్మెంట్ సృష్టిస్తోంది. ఈ సెగ్మెంట్లో మరే ఇతర సంస్థలకు చోటివ్వకుండా విభిన్న, అధునాతన టూ వీలర్లను బడ్జెట్ ధరలోనే అందించే దిశగా అడుగులు వేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా గ్రోమ్ బైకు

హోండా ఇప్పటికే స్కూటర్ మరియు బైక్ ఆధారిత క్రాసోవర్ టూ వీలర్ నవీ బైకును విడుదల చేసింది. ఇప్పుడు ఇదే స్టైల్లో అడ్వాన్స్‌ డిజైన్‌లో గ్రోమ్ అనే మినీ బైకును విడుదలకు సిద్దం చేస్తోంది.

హోండా గ్రోమ్ బైకు

హోండా టూ వీలర్స్ ఇండియా ఇప్పటి వరకు నవీ మరియు క్లిక్ అనే టూ వీలర్లను విడుదల చేసింది. వీటికి తోడు ప్రస్తుతం పరీక్షిస్తున్న గ్రోమ్(MSX125) బైక్ మరియు స్కూపీ స్కూటర్లను విడుదలకు సిద్దం చేస్తోంది.

Recommended Video - Watch Now!
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
హోండా గ్రోమ్ బైకు

దేశీయంగా గ్రోమ్ అనే పేరుతో పరీక్షించబడుతున్న మోడల్, యూరోప్ మరియు పశ్చిమాసియా మార్కెట్లలో ఎమ్ఎస్ఎక్స్125 పేరుతో విక్రయాల్లో ఉంది. ప్రస్తుతం దీనికి సిమ్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రోమ్ ఆధారంగానే హోండా నవీ టూ వీలర్లను 2016లో విడుదల చేసింది.

హోండా గ్రోమ్ బైకు

హోండా గ్రోమ్ టూ వీలర్‌ను రహస్యంగా కాకుండా పబ్లిక్ రోడ్ల మీద పరీక్షించారు. గ్రే మరియు సిల్వర్ బాడీ కలర్‌లో ఉన్న గ్రోమ్ టూ వీలర్ ఫ్రంట్ లుక్, ఛాసిస్ మరియు సీటింగ్ పొజిషన్ వంటివి చూస్తే అచ్చం నవీ టూ వీలర్‌ను పోలి ఉన్నాయి.

హోండా గ్రోమ్ బైకు

ఫ్యూయల్ ట్యాంక్ నవీ టూ వీలర్‌లో ఉన్నట్లే ఉంది. అయితే, ఫ్యూయల్ ట్యాంక్ డీకాల్స్ గ్రోమ్ బైకుకు మరింత స్పోర్టివ్ స్టైల్‌ను అందిస్తోంది. ఇరువైపులా గోల్డెన్ కలర్ అల్లాయ్ వీల్స్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

హోండా గ్రోమ్ బైకు

టెస్ట్ ఫోటోలను గమనిస్తే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మీద ఏబిఎస్ రింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి గ్రోమ్ బైక్ సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. బైకు చివర్లో చిన్న లగేజ్ బాక్స్ ఉంది. దీనిని ఆప్షనల్ యాక్ససరీగా అందించే అవకాశం ఉంది.

హోండా గ్రోమ్ బైకు

సాంకేతికంగా హోండా గ్రోమ్ మినీ బైకులో 124.9సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది 9.7బిహెచ్‌పి పవర్ మరియు 10.9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా గ్రోమ్ బైకు

హోండా గ్రోమ్ ముందువైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం బెనెల్లీ టిఎన్‌టి 135 మినీ బైకును ఇండియాలో ఉత్పత్తి ఆలోచన ఉన్నట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతానికి గ్రోమ్ టూవీలర్‌కు ఎలాంటి పోటీ లేదు.

హోండా గ్రోమ్ బైకు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ గ్రోమ్ మినీ బైకును ఈ ఏడాది చివరి నాటికి లేదా 2018 ప్రారంభంలో విపణిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శనకు రానున్న ఇది 90 వేల రుపాయల ప్రారంభ అంచనా ధరతో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

English summary
Read In Telugu: Honda MSX125 (Grom) Spotted Testing In India
Story first published: Tuesday, September 5, 2017, 17:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark