కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ రికార్డ్ స్పీడ్ వీడియో: గుండెజారి చేతిలోకి

Written By:

తాజాగా ముగిసిన పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. హెవీవెయిట్ మోటార్ సైకిల్ శ్రేణిలో సూపర్ డ్యూక్ ఆర్ బైకును క్రిస్ ఫిల్మోర్ రైడ్ చేసి రికార్డ్ సృష్టించాడు.

కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ రికార్డ్ స్పీడ్

కెటిఎమ్ వద్ద సిద్దంగా లభించే పవర్‌పార్ట్స్‌తో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ ను కస్టమైజ్ చేశారు. కొలరాడో స్ప్రింగ్స్ క్లోజ్ రోడ్ హిల్ క్లైబ్ సర్క్యూట్ లోని 19.99కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫినిష్ లైన్‌ను కేవలం 9 నిమిషాల 49.626 సెకండ్ల కాలవ్యవధిలోనే చేధించాడు.

కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ రికార్డ్ స్పీడ్

క్రిస్ ఫిల్మోర్ ఏఎమ్ఏ సూపర్ బైక్ ఛాంపియన్‌షిప్ రేసర్ మరియు పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో తొలిసారిగా పాల్గొన్నాడు. పైక్స్ పీక్ రేసింగ్‌లో తొలిసారిగానే పాల్గొన్నప్పటికీ, ఈ రేసింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న హై స్పీడ్ రికార్డ్ ఇతగాడు బ్రేక్ చేసాడు.

కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ రికార్డ్ స్పీడ్

ఆస్ట్రియన్‌కు చెందిన కెటిఎమ్ వద్ద అత్యంత శక్తివంతమైన సూపర్ రేసింగ్ బైకు కెటిఎమ్ 12090 సూపర్ డ్యూక్ ఆర్. 2017 వెర్షన్‌లో వచ్చిన ఈ బైకు అనేక అప్‌డేట్స్‌కు గురయ్యింది. సాంకేతికంగా ఇందులో 1,301సీసీ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 141ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో పాల్గొన్నది తొలిసారే అయినప్పటికీ, ఒళ్లుగగుర్పొడిచే ప్రదర్శన కనబరిచాడు క్రిస్ ఫిల్మోర్. ఇక్కడున్న వీడియో చూడండి, ఈ రేస్ ఎంత ప్రమాదకరమైందో మీకే తెలుస్తుంది.

English summary
KTM 1290 Super Duke R Sets New Pikes Peak Record Read In Telugu For More Details
Story first published: Monday, July 3, 2017, 15:09 [IST]
Please Wait while comments are loading...

Latest Photos