రూ. 15.59 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 బైక్

Written By:

ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లోకి బ్రుటాలె 800 బైకును రూ. 15.59 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఎమ్‌వి అగస్టా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేస్తున్న దీనిని దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్‌వి అగస్టా షోరూమ్‌లలో అందుబాటులోకి తెలిపింది.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

ఎమ్‌వి అగస్టా మరియు బ్రుటాలె800 గురించి...

ఇటాలియన్ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ ఎమ్‌వి అగస్టా సరిగ్గా 15 ఏళ్ల క్రితం బ్రుటాలె ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు నూతన డిజైన్‌లో, అత్యుత్తమ ఆన్ రోడ్ శక్తిసామర్థాల గల అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో బ్రుటాలె 800 పర్ఫామెన్స్‌ బైకును విడుదల చేసింది. రేసింగ్ చరిత్రలో సుదీర్ఘ అనుభవం గల ఎమ్‌వి అగస్టా బ్రుటాలె800 బైకును ఎక్కువ పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్‌లో నిర్మించింది.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

ఎమ్ అగస్టా బ్రుటాలె 800 ఇంజన్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 బైకులో 798సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఇన్ లైన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 11,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 109బిహెచ్‌పి పవర్ మరియు 7,600ఆర్‌పిఎమ్ వద్ద 83ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. బ్రుటాలె 800 గరిష్ట వేగం గంటకు 237కిలోమీటర్లుగా ఉంది.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

బ్రుటాలె 800లోని 3-సిలిండర్ ఇంజన్‌లో ప్రతి సిలిండర్‌లో MVICS(మోటార్ అండ్ వెహికల్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్) ద్వారా ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. ఇందుకో ఒక్కో సిలిండర్‌కు ఒక ఇంజెక్టర్ చెప్పున మూడు ఇంజెక్టర్లు ఉన్నాయి. ఎనిమిది దశలలో టార్క్ విడుదల చేసే టార్క్ కంట్రలో సిస్టమ్ కలదు.

ఎమ్‍‌వి అగస్టా బ్రుటాలె800 బైకులో భద్రత పరంగా రైడ్ బై వైర్ సిస్టమ్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్విక్ షిఫ్టర్ మరియు స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 డిజైన్ మరియు ఫీచర్లు...

డిజైన్ పరంగా మునుపటి జనరేషన్ బైకుతో పోల్చుకుంటే గుర్తించదగిన కొన్ని మార్పులు ఇందులో చోటు చేసుకున్నాయి. నేక్డ్ వెర్షన్‌ సూపర్ బైకు(బ్రుటాలె 800)లో సరికొత్త అల్యూమినియం సబ్ ఫ్రేమ్, రీపొజిషన్ చేయబడిన రియర్ ఫుట్ పెగ్స్, నూతన హెడ్ ల్యాంప్ కన్సోల్ మరియు ఇస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో గుర్తించవచ్చు.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

సస్పెన్షన్ కోసం ముందు వైపున రీబౌండ్ కంప్రెషన్ డ్యాంపింగ్ మరియు ఎక్ట్సర్నల్ అడ్జస్టబుల్ ప్రిలోడ్ కాన్ఫిగరేషన్ ఫీచర్ కలిగి ఉన్న 43ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోర్క్ కలదు. వెనక వైపున అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

బ్రుటాలె 800 లో బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు చక్రానికి 320ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న రెండు ఫ్లోటింగ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వీటి మీద రేడియల్‌గా నిర్మించిన బ్రెంబో 4-పిస్టన్ కాలిపర్స్ ఉన్నాయి. అదే విధంగా రియర్ వీల్ కోసం 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ 2-పిస్టన్ కాలిపర్స్ కలిగి ఉంది.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె800 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద కూర్చుంది. వీటికి ముందు వైపు 120/70- జడ్ఆర్17 మరియు వెనుక వైపున 180/55 - జడ్ఆర్17 కొలతల్లో ఉన్న పిరెల్లీ డియాబ్లో రోస్సో III టైర్లు ఉన్నాయి.

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

బ్రుటాలె 800 విడుదల వేదిక మీద మోటోరాయలే - ఎమ్‌వి అగస్టా ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అజింక్యా ఫిరోడా మాట్లాడుతూ, "ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి బ్రుటాలె 800 గురించి ఎంతో విచారించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో ఎమ్‌వి అగస్టా ఇండియా లైనప్‌లో బ్రుటాలె 800 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలవనుంది విశ్వాసం వ్యక్తం చేశాడు."

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎమ్‌వి అగస్టా బ్రుటాలె 800 విపణిలో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ మరియు కవాసకి జడ్900 లకు పోటీగా నిలవనుంది. ఈ రెండింటితో పోల్చుకుంటే బ్రుటాలె 800 తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు వాటి కన్నా దీని ధర 7 లక్షలు ఎక్కువగా ఉంది.

English summary
Read In Telugu: MV Agusta Brutale 800 Launched In India At Rs 15.59 Lakh
Story first published: Wednesday, July 19, 2017, 17:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark