2017 సుజుకి జిక్సర్ ఎస్‌పి సిరీస్ విడుదల: ప్రారంభ ధర రూ. 81,175 లు

Written By:

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(SMIPL) 2017 సిరీస్ జిక్సర్ ఎస్‌పి బైకులను విడుదల చేసింది. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) గల జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి మరియు జిక్సర్ ఎస్‌పి బైకులను 2017 సిరీస్‌లో విడుదలయ్యాయి.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి (ABS & FI) ధర రూ. 99,312 లు మరియు జిక్సర్ ఎస్‌పి ధర రూ. 81,175 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 జిక్సర్ ఎస్‌పి సిరీస్ బైకులు

2017 సుజుకి జిక్సర్ ఎస్‌పి సిరీస్ మోటార్ సైకిళ్లలో ఆకర్షణీయమైన ట్రై కలర్ కాంబినేషన్, డీకాల్స్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ మీద ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ బైకుల్లో స్పోర్టివ్ శైలిని పెంచేందుకు 2017 ఏడాదిని సూచించే గుర్తులు కూడా ఉన్నాయి.

Recommended Video
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
2017 జిక్సర్ ఎస్‌పి సిరీస్ బైకులు

సాంకేతికంగా జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి మరియు జిక్సర్ ఎస్‌పి బైకుల్లో 155సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఇవి 14.8బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2017 జిక్సర్ ఎస్‌పి సిరీస్ బైకులు

జిక్సర్ ఎస్‌పి బైకులో కార్బోరేటర్ ఇంజన్ కలదు మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి బైకులో ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ కలదు. అయితే రెండు ఇంజన్‌ల సామర్థ్యం 155సీసీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్ల వద్ద ఆరేంజ్ బ్లాక్ కలర్ ఎడిషన్‌లో లభించే ఈ 2017 సిరీస్ బైకులను ఎంచుకోగలరు.

2017 జిక్సర్ ఎస్‌పి సిరీస్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో 160సీసీ సెగ్మెంట్లో లభించే బైకుల్లో ఏబిఎస్ ఫీచర్‌ను తొలి బైకు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి. బైకుల్లో సేఫ్టీ పరంగా ఏబిఎస్ కీలక పాత్ర. ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో విడుదల కావడంతో స్పోర్టివ్ ఫీల్ కలిగించే ఈ బైకులు యువత మనసు కొల్లగొట్టడం ఖాయం.

సుజుకి జిక్సర్ ఎస్‌పి మోడల్ విపణిలో ఉన్న హోండా సిబి హార్నెట్ 160ఆర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 మరియు యమహా ఎఫ్‌జడ్ వి2.0 లకు పోటీనివ్వగా అదే విధంగా జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి బైకు యమహా ఫేజర్ వి2.0 బైకు మీద గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: 2017 Suzuki Gixxer SP Series Launched in India; Prices Start At Rs 81,175
Story first published: Friday, August 18, 2017, 10:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark