100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

100సీసీ కన్నా తక్కువ కెపాసిటి ఇంజన్ గల స్కూటర్ లేదా బైకు మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి. అంటే, డబుల్ రైడింగ్ ఇక ఏ మాత్రం ఎంకరేజ్ చేయరన్నమాట.

By Anil

ముగ్గురు కాదు... ఇద్దరు కాదు... ఇక మీదటే ఒక టూ వీలర్ మీద ఒక్కరే ప్రయాణించాలి. ఉత్తర కొరియా డ్రైవింగ్ రూల్స్‌లో ఇదీ ఒకటనుకుంటే పొరబడినట్లే. ఎందుకుంటే ఈ రూల్ అతి త్వరలో కర్ణాటకలో అమలు కానుంది.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

100సీసీ కన్నా తక్కువ కెపాసిటి ఇంజన్ గల స్కూటర్ లేదా బైకు మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి. అంటే, డబుల్ రైడింగ్ ఇక ఏ మాత్రం ఎంకరేజ్ చేయరన్నమాట. మీరు బెంగళూరులో నివశిస్తున్నట్లయితే, లేదా మీ వాళ్లు బెంగళూరులో ఉంటే ఈ విషయాన్ని తెలియజేయండి.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

ఇప్పటికే టూ వీలర్లను వాడుతున్న ప్రజలకు ఈ నియమం వర్తించదు. కొత్తగా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న బ్యాన్ కేవలం కొత్త టూ వీలర్లకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో 100సీసీ అంతకన్నా తక్కువ కెపాసిటి గల టూ వీలర్‌ను కొనుగోలు చేస్తే గుర్తుంచుకోండి వాటి మీద ఒక్కరే వెళ్లాలి.

Recommended Video

Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

కొత్త రూల్‌కు అనుగుణంగా 100సీసీ కెపాసిటి గల టూ వీలర్లలో వాటిని తయారు చేసే సంస్థలు కేవలం ఒక్కరు మాత్రమే కూర్చనే విధంగా సింగల్ సీట్ అందించాల్సి ఉంటుంది. ఒక విధంగా దీని ప్రభావం టూ వీలర్ల కంపెనీల సేల్స్ మీద పడే అవకాశం ఉంది.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

అయితే, సింగల్ సీటుతో వచ్చే 100సీసీ టూ వీలర్ల సీటును మార్చడం, ఇద్దరు ప్రయాణించేందుకు మరో సీటును జోడిచడం చట్టరీత్యా నేరం కానుంది. ఇలా మోడిఫైడ్ సీటుతో పోలీసుల కంటబడితే దానికి కొత్త జరిమానా మరియు శిక్షలు పడనున్నాయి.

Trending On DriveSpark Telugu:

పాక్-చైనా దుందుడుకు చర్యలకు ముగింపు ఖాయం!

34 లక్షల విలువైన విజయ్ మాల్యా లగ్జరీ కార్లు రూ. 1.4 లక్షలకే!

10 లక్షలలోపు ధరతో లభించే ఐదు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

భద్రత పరంగా 100సీసీ లోపు సామర్థ్యం ఉన్న టూ వీలర్లు రోడ్డు మీద పడిపోతున్నాయని డబుల్ రైడ్ బ్యాన్ చేస్తూ కొత్త రూల్ అందుబాటులోకి వస్తోంది. అయితే, 100సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల టూ వీలర్లు కూడా పడిపోతున్నాయి. అయితే, ఈ రూల్‌ను ఈ ప్రాతిపదికను ప్రవేశపెడుతున్నారో తెలియరాలేదు.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

హై కోర్టు విడుదల చేసిన సర్క్యులర్‌కు ముందే కర్ణాటకు ప్రభుత్వం ఈ రూల్ విషయమై హై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. భవిష్యత్తులో సింగల్ సీటును డబుల్ సీటింగ్‌గా మార్చితే ఓవర్‌లోడ్ క్రింద శిక్షార్హులుగా గుర్తిస్తామని అందులో పేర్కొంది.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

డబుల్ రైడింగ్ బ్యాన్ రూల్‌ను ఖాయం చేస్తూ, కర్ణాటక రవాణా శాఖ మంత్రి హెచ్ఎమ్ రేవన్న బెంగళూరు మిర్రర్‌తో మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే హై కోర్టుకు ప్రశ్నకు స్పందిస్తూ, నగరంలో 100సీసీ లోపు గల టూ వీలర్లలో డబుల్ రైడింగ్ బ్యాన్ నియమాన్ని ప్రతిపాదించినట్లు తెలిపాడు.

100సీసీ టూ వీలర్ మీద డబుల్ రైడింగ్ బ్యాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

తక్కువ కెపాసిటి గల టూ వీలర్లలో ఇద్దరు ప్రయాణించడంతోనే క్రిందపడి ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు నగరంలో ఉన్న అన్ని రోడ్లను అతుకులు గతుకులు లేకుండా చేస్తే ఎలాంటి రూల్స్ అవసరం లేదనేది సామాన్యుల వాదన...

ఈ రూల్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

English summary
Read In Telugu: Pillion riding banned for 2-wheelers with less than 100 cc in Bangalore!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X