ప్రొడక్షన్‍‌ దశకు చేరుకున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రీమియిమ్ పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఈ సెగ్మెంట్లోకి ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌ను

By Anil

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రీమియిమ్ పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఈ సెగ్మెంట్లోకి ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌ను మొదటి మోడల్‌గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

తాజాగా, ప్రొడక్షన్ దశకు చేరుకున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైక్ ఫోటోలు కొన్ని లీకయ్యాయి. ప్రొడక్షన్ మోడల్ అచ్చం కాన్సెప్ట్ రూపంలో ఉన్న మోడల్‌నే పోలి ఉంది. అయితే, స్వల్ప మార్పులు ఇందులో చోటు చేసుకున్నాయి.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

హీరో మోటోకార్ప్ 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని డిజైన్, ఫీచర్లు మరియు సాంకేతిక అంశాలను ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగింది.

Recommended Video

Yamaha Considering Electric Two-Wheelers For India - DriveSpark
హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

ఫ్రంట్ డిజైన్‌లో కాన్సెప్ట్ వెర్షన్ హెడ్ ల్యాంప్ యథావిధిగా వచ్చింది. అయితే, ట్యాంక్ మీద ఉన్న కండలు తిరిగిన రూపంలో కొద్దిగా మార్పులు జరిగాయి. బ్లాక్ ప్లాస్టిక్ జతగా కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ గల సైడ్ ప్యానల్స్ ఇరువైపులా ఉన్నాయి.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

హీరో మోటోకార్ప్ ఇందులో డ్యూయల్ టోన్ స్టెప్ అప్ సీట్ అందించింది. ఇందులో రైడర్ సీట్ రెడ్ కలర్ మరియు పిలియన్ సీటు బ్లాక్ కలర్‌లో ఉండటాన్ని గమనించవచ్చు. రియర్ సెక్షన్ సన్నగా పదునుగా ఉంటుంది. ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు కూడా ఉన్నాయి.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

సాంకేతికంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకులో 200సీసీ కెపాసిటి గల ఆల్ న్యూ ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 18.2బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

పైన పేర్కొన్న వాటితో పాటు, హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకులో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, లీకైన ఫోటోలో ఫ్రంట్ వీల్ వద్ద ఏబిఎస్ రింగ్ ఉంది. అంటే హీరో ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందించే అవకాశం ఉంది.

హీరో ఎక్స్‌‌ట్రీమ్ 200ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో ఇప్పటి వరకు 200సీసీ సెగ్మెంట్లో ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. అయితే ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా హై కెపాసిటి మోటార్ సైకిళ్లనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 200సీసీ కెపాసిటి గల ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకును పరిశ్రమకు పరిచయం చేసింది.

ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, కెటిఎమ్‌ డ్యూక్200, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులతో బరిలోకి దిగనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Production-Spec Hero Xtreme 200S Image Leaked; Launch Imminent?
Story first published: Wednesday, December 20, 2017, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X