రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్ల భరతం పడుతున్న పోలీసులు: వారికి ఇదే సరైన శిక్ష

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల సైలెన్సర్లను తొలగించి, కంపెనీ సైలెన్సర్ల స్థానలో మోడిఫైడ్ సైలన్సర్లు గల బైకుల నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ బైకు మీద సరదా రైడింగ్ అందరికీ ఇష్టమే, కానీ పెద్ద శబ్ధాన్నిచ్చే సైలెన్సర్లతో రైడింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందిపెట్టనంత వరకు బాగానే ఉంటుంది. అలా కాదని, మొండిగా ఇష్టమొచ్చినట్లు రోడ్ల మీద శబ్దం చేసుకుంటు వెళ్లి పోలీసుల కంటపడ్డారో అంతే సంగతి.

దొరికిన వారి బైకుల సైలెన్సర్లను వారి చేతే సుత్తితో నుజ్జు నుజ్జు చేయిస్తున్నారు, అంతటితో వదలకుండా ఆ బైకులను కూడా సీజ్ చేస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల సైలెన్సర్లను తొలగించి, కంపెనీ సైలెన్సర్ల స్థానలో మోడిఫైడ్ సైలన్సర్లు గల బైకుల నడుపుతూ ఇబ్బందులు కలగజేస్తున్నారని పూనే, మైసూర్, బెంగళూరు మరియు కేరళలలోని కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులకు ఆయా నగరాల ప్రజలు ఫిర్యాదు చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్లను నిలిపి సైలన్సర్ శబ్దాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎక్కువ శబ్దాన్నిచ్చే సైలన్సర్లు లేదంటే మోడిఫైడ్ సైలన్సర్లు ఉన్నట్లయితే ఆ రైడర్లను మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 190(2) క్రింద శిక్షార్హులుగా గుర్తిస్తున్నారు.

Recommended Video

Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

ఈ మధ్య బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక జట్టుగా సిటీలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 11 రాయల్ ఎన్ఫీడ్ బైకులను గుర్తించినట్లు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. ఈ 11 బైకుల సెలెన్సర్లను తొలగించడంతో పాటు వారికి జరిమానా కూడా విధించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

మోటార్ సైకిళ్ల కంపెనీలు అందించే సైలన్సర్లను తొలగించడం లేదా మార్చడం పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమవుతుంది. ఇందుకు గాను రూ. 1,000 ల జరిమానాతో పాటు దీనితో పాటు ఆ బైకుల సైలెన్సర్లను ధ్వంసం చేయడాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు.

Trending On DriveSpark Telugu:

విజయవాడ-అమరావతి మధ్య హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్

కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్

8 లక్షల వరకు డిస్కౌంట్లు: భారీ దీపావళి ఆఫర్లతో ముందుకొచ్చిన పది మోడళ్లు

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

మోటార్ సైకిళ్ల కంపెనీలు అందించే సైలన్సర్లను తొలగించడం లేదా మార్చడం పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమవుతుంది. ఇందుకు గాను రూ. 1,000 ల జరిమానాతో పాటు దీనితో పాటు ఆ బైకుల సైలెన్సర్లను ద్వంసం చేయడాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

శబ్ద కాలుష్యానికి కారణమయ్యే బైకుల సీజ్‌తో పాటు యజమానులకు భారీ జరిమానా విధిస్తూ ఈ మధ్య కాలంలో శబ్ద కాలుష్య నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పూనే ట్రాఫిక్ పోలీస్ డిప్యూటి కమీషనర్ తెలిపాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

గత జూలై నెలలో పూనేలో మూడు రోజుల డ్రైవ్ నిర్వహించాడు. ఈ డ్రైవ్‌లో 14 జూలై తొలిరోజున 43 కేసులు నమోదయ్యాయి మరియు 11,200 రుపాయలు జరిమానా విధించారు. రెండవ రోజు డ్రైవ్ జూలై 15 న 88 కేసులు నమోదు చేసి రూ. 17,700 ల జరిమానా వసూలు చేశార. మరియు జూలై 16 తేదీన 49 కేసులు నమోదు చేసి 7,300 ల ఫైన్ కలెక్ట్ చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

ఒక్క పూనేలో మూడు రోజుల పాటు నిర్వహించిన డ్రైవ్‌లో 36,200 రుపాయల జరిమానాలు వసూలు చేశారు. అంటే ఒక్క పూనే నగరంలో ఈ విధంగా జరిమానా వసూలు అయ్యిందంటే అనధికారిక సైలెన్సర్లతో ఎన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఏ మేరకు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెద్ద శబ్దం చేసుకుంటూ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో తిరగడం మీ ఉన్నతి మరియు స్టేటస్‌కు ప్రతీకగానే ఉంటుంది. అయితే, ఆ శబ్దానికి చిన్న పిల్లలు, మహిళలు, వృద్దులు ఇలా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, వీరి స్థానంలో మన కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

మన ఫ్యామిలీతో బయటకు వెళ్లినపుడు ఇతరులు బైకుల మీద శబ్దం చేసుకుంటూ వెళితే మీ సహించగలరా...? అస్సలు సహించరు కదా... కాబట్టి మీ వద్ద ఉన్న రాయల్ ఎన్పీల్డ్ బైకులో సైలెన్సర్ తీసేయడం లేదంటే ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సైలన్సర్లను అమర్చడం చేయకండి...

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి తెలుసా...?

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన నిజాలు

Picture credit: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield owners with loud exhausts beware – Cops will seize your bike, and break your silencer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X