డీలర్ల వద్ద పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ రహస్యంగా అభివృద్ది చేసిన ఓ సరికొత్త మోడల్‌ను అత్యంత రహస్యంగా డీలర్ల వద్దకు చేర్చింది. థండర్‌బర్డ్ 500ఎక్స్ పేరుతో డెవలప్ చేసిన ఇది పూర్తిగా కొత్తగా ఉంది.

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే అందరికి గుర్తొచ్చే మోడల్స్ బుల్లెట్, క్లాసిక్ మరియు థండర్‌బర్డ్ బైకులు. ఇప్పుడు తమ లైనప్‌ను పెంచుకునేందుకు నిరంతరం కొత్త మోడళ్లను అభివృద్ది చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను ఆవిష్కరించింది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ రహస్యంగా అభివృద్ది చేసిన ఓ సరికొత్త మోడల్‌ను అత్యంత రహస్యంగా డీలర్ల వద్దకు చేర్చింది. థండర్‌బర్డ్ 500ఎక్స్ పేరుతో డెవలప్ చేసిన ఇది పూర్తిగా కొత్తగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ గురించి కంప్లీట్ డిటైల్స్...

Recommended Video

Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకును ఇప్పటి వరకు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది లేదు. అయితే, ప్రొడక్షన్ వెర్షన్ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులను ఉన్నట్లుండి డీలర్లకు సరఫరా చేసింది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

సరికొత్త హ్యాండిల్ బార్, అల్లాయ్ వీల్స్, సింగల్ పీస్ లార్జ్ సీట్ మరియు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్‌కు సిద్దం చేసి, ఒక్కసారిగా విపణిలోకి లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

థండర్‌బర్డ్ 500ఎక్స్ విభిన్న కొత్త రంగుల్లో లభించనుంది. ఎలక్ట్రిక్ బ్లూ, క్యాండీ రెడ్, వైట్ మరియు యెల్లో రంగులు. ఇంజన్, ఎగ్జాస్ట్ మరియు సస్పెన్షన్ వంటివి బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఫ్లాట్‌గా ఉన్న హ్యాండిల్ బార్, ముందువైపుకు సెట్ చేసిన ఫుట్ పెగ్స్ వంటివి బైక్‌కు పూర్తిగా కొత్త రూపాన్నిచ్చాయి.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

ట్యూబ్ లెస్ టైర్లు గల 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ థండర్‌బర్డ్ 500ఎక్స్‌కు స్పోర్ట్ స్టైల్ తీసుకొచ్చాయి. కొత్తగా డిజైన్ చేయబడిన సీట్ మరియు ఫ్లాట్ హ్యాండిల్ బార్ రైడర్‌గా రిలాక్స్ రైడింగ్ పొజిషన్ కల్పిస్తాయి. రియర్ డిజైన్‌ కూడా స్వల్పంగా మోడిఫైడ్ చేయబడింది.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

మిలిటరీ గ్రీన్ కలర్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్: హై స్పీడ్ చేజింగ్

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను స్టాండర్డ్ థండర్‌బర్డ్ 500 బైకు నుండే సేకరించారు. అయితే, ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఎల్ఇడి టెయిల్ లైట్లు ఉన్నాయి. ఎగ్జాస్ట్ మఫ్లర్ చూడటానికి కొత్తగా, స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే పొడవుగా ఉంటుంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

క్రూయిజర్ స్టైల్లో కనపించే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులో పిలియన్ రైడర్ బ్యాక్ రెస్ట్ మిస్సయ్యింది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు అందివ్వబడ్డాయి.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులో 500సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ చివరికి తమ పాపులర్ థండర్‌బర్డ్ 500 బైకును కొత్త రూపంలో తీర్చిదిద్ది థండర్‌బర్డ్ 500ఎక్స్ అనే సరికొత్త పేరుతో లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఈ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకును జనవరి 2018లో విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదక మీద ఆవిష్కరించే అవకాశం ఉంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్

ఏదేమైనప్పటికీ, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బైకులను ఉత్పత్తి చేస్తోందా అని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులను ఆశ్చర్యపరిచేలా రూపొందించిన థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకు విపణిలో క్రూయిజర్ స్టైల్ పర్ఫామెన్స్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది. ఇది సుమారుగా రూ. 2 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

మరిన్ని ఆటోమొబైల్ స్టోరీస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Thunderbird 500X Spotted At Dealership; Launch Imminent?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X