యమహా నుండి మరో స్కూటర్: రహస్యంగా పరీక్షిస్తున్న యమహా

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా ఇండియన్ మార్కెట్లోకి రెండు టూ వీలర్లను విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. అందులో ఫేజర్ 250 మోటార్ సైకిల్‌ను ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించగా, ఇప్పుడు ఓ స్కూటర్‌ను పరీక్షిస్తూ పట్టుబడింది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు...

దేశీయంగా స్కూటర్ల మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో యమహా మరో స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. బాడీ మొత్తం వైట్ పెయింట్ చేయబడిన స్కూటర్‌ను యమహా పరీక్షిస్తుండంగా ఓ మీడియా బృందం గుర్తించింది.

ఫ్యాసినో తరువాత మరో స్కూటర్‌ను డెవలప్ చేసింది. చెన్నైలో పరీక్షిస్తూ పట్టుబడిన ఈ స్కూటర్‌లో యమహా లోగో కలిగి ఉన్న గ్రాబ్ రెయిల్, టెయిల్ ల్యాంప్స్ ను గుర్తించడం జరిగింది. ఫ్యాసినో డిజైన్ లక్షణాలతో రానున్న దీని రియర్ డిజైన్ స్పోర్టివ్ శైలిలో ఉంది. యమహా వద్ద ఉన్న అదే 110సీసీ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.

యమహా వద్ద ఉన్న సిగ్నస్ ఆల్ఫా స్కూటర్ స్థానాన్ని ఈ న్యూ స్కూటర్ భర్తీ చేసే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఈ స్కూటర్‌ను గమనిస్తే, విపణిలో హోండా ఆక్టివా మరియు టీవీఎస్ జూపిటర్ లకు గట్టిపోటీగా రానున్నట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ మార్కెట్లో స్కూటర్ల సెగ్మెంట్ రోజు రోజుకీ పుంజుకుంటోంది. ప్రత్యేకించి నగర మరియు ప్రాంతీయ కొనుగోలుదారులు స్కూటర్లను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో స్కూటర్ల అభివృద్ది చేసుకుంటున్నాయి టూ వీలర్ల తయారీ సంస్థలు.

English summary
Spy Pics: Yamaha’s New Scooter Spotted Testing Read In Telugu For More Details
Story first published: Monday, July 3, 2017, 14:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos