సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 59,063 లు

Written By:

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లలో విపణిలోకి విడుదలయ్యింది. సరికొత్త కలర్ ఆప్షన్‌లో లభించే లిమిటెడ్ ఎడిషన్ యాక్సెస్ 125 స్కూటర్ ప్రారంభ ధర రూ. 59,063లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

సుజుకి తమ యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో రెండు మ్యాట్ కలర్ ఆప్షన్‌లను పరిచయం చేసింది. అవి, మెటాలిక్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్. స్పోర్ట్ ఫీల్ కలిగించే మ్యాట్ ఫినిషింగ్ బాడీ పెయింట్ జాబ్ మరియు రెట్రో స్టైల్ రూపంలో ఇది అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్‌ స్కూటర్‌లో నూతన పెయింట్ స్కీమ్‌తో పాటు, ముందు వైపున డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా అందివ్వడం జరిగింది. అంతే కాకుండా దీనిని మెటాలిక్ వైట్ మరియు వింటేజ్ మెరూన్ సీట్ కవర్లు కలవు. వీటన్నింటి జోడింపుతో రెగ్యులర్ వెర్షన్ కన్నా ఇది ఎంతో విభిన్నంగా ఉంది.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

దీని విడుదల సంధర్భంగా సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోషి ఉచిద మాట్లాడుతూ," సుజుకి ఇండియా లైనప్‌లో అత్యుత్తమ విక్రయాలు సాధించి పెడుతున్న మోడల్ యాక్సెస్ 125. మాన్‌సూన్ మరియు పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి కొత్త మ్యాట్ కలర్ ఆప్షన్‌లో విడుదల చేసినట్లు చెప్పుకొచ్చాడు."

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

సాంకేతికంగా యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో 124సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున స్వింగ్ ఆర్మ్ టైప్ సస్పెన్షన్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులను అందివ్వడం జరిగింది. అయితే ఆప్షనల్‌గా ఫ్రంట్ డిస్క్ బ్రేకుతో ఎంచుకోవచ్చు.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

సుజుకి ప్రతినిధుల ప్రకారం ఇది లీటర్‌కు 64కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. సుజుకి ఎకో పర్ఫామెన్స్ అనే టెక్నాలజీ ద్వారా మైలేజ్ పెరిగిందని సుజుకి వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో యాక్సెస్ 125 హోండా ఆక్టివా 125కు గట్టిపోటీనివ్వనుంది.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల

మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, క్రోమ్ ఫినిషింగ్ గల హెడ్ ల్యాంప్ మరియు రియర్ వ్యూవ్ మిర్రర్స్, డిజిటల్ అనలాగ్ కన్సోల్, వన్ ఫుష్ షటర్ లాక్ మరియు డ్యూయల్ లగేజ్ హుక్స్ వంటి ప్రధానమైన ఫీచర్లు ఉన్నాయి.

English summary
Read In Telugu: Suzuki Access 125 Special Edition With Matte Colours Launched In India At Rs 59,063
Story first published: Saturday, July 15, 2017, 16:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark