ఊహించని ధరతో విడుదలైన సుజుకి ఇంట్రూడర్ 150: ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్

Written By:

జపాన్ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా నేడు విపణిలోకి సరికొత్త ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సుజుకి ఇంట్రూడర్ 150 ప్రారంభ ధర రూ. 98,340 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మార్కెట్లో ఉన్న బజాజ్ అవెంజర్ 150 కు ఇంట్రూడర్ 150 గట్టి పోటీనివ్వనుంది.

విభిన్న డిజైన్‌లో, నూతన ఫీచర్లతో విడుదలతో విడుదలైన సుజుకి ఇంట్రూడర్ 150 గురించిన పూర్తి విడుదల వివరాలు క్రింది కథనంలో....

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

సుజుకి ఇంట్రూడర్ 150 బైకులో జిక్సర్ 150 నుండి సేకరించిన 154.9సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. సరికొత్త ఇంట్రూడర్‌లో ఉన్న ఇంజన్ గరిష్టంగా 14.6బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

సుజుకి ఇంట్రూడర్ 150 లోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. క్రూయిజర్ సెగ్మెంట్లో విడుదలైన ఇంట్రూడర్ 150లో ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

భద్రత విషయంలో సుజుకి ఇంట్రూడర్ 150లో ఫ్రంట్ వీల్‌కు సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా ఉంది. క్రూయిజర్ సెగ్మెంట్లో అవెంజర్ 150 కి గట్టి పోటీనిచ్చే ఇంట్రూడర్ 150 మైలేజ్ లీటర్‌కు 44కిలోమీటర్లుగా ఉంది.

సుజుకి ఇంట్రూడర్ 150 డిజైన్ మరియు ఫీచర్లు...

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

ఇంట్రూడర్ 150 మోడల్ డిజైన్ మరియు పేరును సుజుకి లైనప్‌లో ఉన్నఇంట్రూడర్ ఎమ్1800ఆర్ నుండి పొందింది. సుజుకి ఉత్పత్తి చేసే అతి పెద్ద క్రూయిజ్ మోటార్ సైకిల్ ఇంట్రూడర్ ఎమ్1800ఆర్, దీని ప్రేరణతోనే సుజుకి ఇంట్రూడర్ 150 బైకును అభివృద్ది చేసింది.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

సుజుకి ఇంట్రూడర్ 150 లో ట్రయాంగిల్ హెడ్ ల్యాంప్, కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్, హెడ్ ల్యాంప్ పైన అమర్చిన టర్న్ ఇండికేటర్లు మరియు క్రోమ్ ఫినిషింగ్ గల రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి జీతం ఎంతో తెలుసా....?

కేవలం 2 గంటల్లో ఐదు లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

డిజిలాకర్‌లో DL, RC చూపిస్తే, మోడీకి చూపించమన్న పోలీస్: ఎందుకో తెలుసా....?

డిసెంబర్ 1, 2017 నుండి అన్ని ఫోర్ వీలర్ల ఫాస్ట్‌ ట్యాగ్ తప్పనిసరి చేసిన కేంద్రం

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

జిక్సర్ 150 డిజైన్ మరియు విడిపరికరాలతో వచ్చినప్పటికీ ఇంట్రూడర్ 150 బైకుపై రిలాక్స్‌గా కూర్చుని రైడింగ్ చేయవచ్చు. జిక్సర్ నుండి సేకరించిన ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఇందులో ఉంది. వీటితో పాటు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్, డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

రియర్ సీట్ విషయానికి వస్తే, రైడర్ సీటుకిచ్చిన ప్రాధాన్యత పిలియన్ సీటుకు ఇవ్వలేదని చెప్పవచ్చు. చిన్న గిన్నెను బోర్లించిన ఆకారంలో ఉన్న పిలయన్ సీట్ మరియు పిలియన్ సపోర్ట్ కోసం చిన్న పాటి గ్రాబ్ రెయిల్ అందివ్వడం జరిగింది. రియర్ డిజైన్‌ మొత్తం ఇంట్రూడర్ ఎమ్1800ఆర్ మోడల్‌కు జిరాక్స్ కాపీ అని చెప్పవచ్చు.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

సుజుకి ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌లో జిక్సర్ నుండి సేకరించిన 17-అంగుళాల పరిమాణం గల త్రీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 7-దశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌తో ఒక కొత్త ప్రయోగం చేయబోతోందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యూచరిస్టిక్ డిజైన్ అంశాలు గల మోటార్ సైకిళ్లు విడుదలయ్యింది. సామాన్య మరియు యువ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని ధరకు తగ్గ విలువలతో విడుదల చేసింది.

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదల

బజాజ్ అవెంజర్ 150 తో పోల్చుకుంటే సుజుకి ఇంట్రూడర్ ధర 8 వేల రుపాయల వరకు అధికంగా ఉంది. అయితే, ఇందులో క్రూయిజర్ సెగ్మెంట్ లక్షణాలతో పాటు అధునాతన డిజైన్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి, అవెంజర్ 150 మరియు ఇంట్రూడర్ 150 బైకుల్లో దేని ఎంపిక మంచిదో క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

English summary
Read In Telugu: Suzuki Intruder 150 Launched At Rs 98,340 In India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark