అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి విడుదల చేసిన టీవీఎస్

టీవీఎస్ మోటార్స్ తమ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటార్ సైకిల్‌ను ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) వెర్షన్‌లో విడుదల చేసింది. సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ 4వి ప్రారంభ వేరియంట్ ధర రూ. 1,07,005 లుగా ఉంది.

By Anil

టీవీఎస్ మోటార్స్ తమ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటార్ సైకిల్‌ను ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) వెర్షన్‌లో విడుదల చేసింది. సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ 4వి ప్రారంభ వేరియంట్ ధర రూ. 1,07,005 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

టీవీఎస్ మోటార్స్ లైనప్‌లో అతి ముఖ్యమైన మోడల్ అపాచే ఆర్‌టిఆర్ 200ఎఫ్ఐ 4వి దేశవ్యాప్తంగా ఉన్న కేవలం ఎంచుకోదగ్గ విక్రయ కేంద్రాలలో మాత్రమే లభ్యమవుతోంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ వెర్షన్ అపాచే గురించి మరిన్ని వివరాలు నేటి కథనంలో....

Recommended Video

[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

సాధారణంగా బైకుల్లో ఇంజన్‌కు ఫ్యూయల్ అందించే పరికరం పేరు కార్బోరేటర్ అంటారు. యాక్సిలరేటర్ ఆపరేట్ చేయడం ద్వారా ఇంజన్‌లోకి ఇంధన సరఫరాను కంట్రోల్ చేయవచ్చు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

అయితే, ఇందులో ఫ్యూయల్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. దీనిని అధగమించేందుకు వచ్చిన టెక్నాలజీ పేరే ఫ్యూయల్ ఇంజెక్షన్. యాక్సిలరేటర్ ఆపరేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఎంత ఇంధన అవసరమైతే అంతే ఇందనం ఇంజన్‌లోకి వెళుతుంది. ఈ పద్దతిలో ఫ్యూయల్ లాస్ జరగకుండా అత్యుత్తమ పవర్ చక్రాలకు అందుతుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

తాజాగా టీవీఎస్ మోటార్స్ తమ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అందించింది. సాంకేతింగా ఇందులో ఉన్న శక్తివతంమైన 197.5సీసీ కెపాసిటి గల ఇంజన్ 20.71బిహెచ్‌పి పవర్ మరియు 18.1ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ బైకు కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఎఫ్ఐ వెర్షన్ అపాచే గరిష్ట వేగం గంటకు 129కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి బైకులో ట్విన్-స్ప్రే-ట్విన్-పోర్ట్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని టీవీఎస్ అందించింది. ఈ పరిజ్ఞానంతో యాక్సిలరేషన్ వేగంగా స్పందించడం, తక్కువ ఉద్గారాలు విడుదలవడంతో పాటు అత్యుత్తమ రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ సాధ్యమవుతుందని టీవీఎస్ పేర్కొంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

ఇంజన్‌కు అమర్చిన ఎఫ్‌ఐ మినహాయిస్తే, ఈ బైకులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. డిజైన్ పరంగా ఎలాంటి మార్పలు జరగలేదు. ఎఫ్ఐ అప్‌డేటెడ్ వెర్షన్ కూడా అవే మునుపటి కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

అపాచే ఆర్‌టిఆర్ 400 ఎఫ్ఐ4వి ముందు వైపు 37ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపు మోనోషాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకిగ్ కార్యకలాపాల కోసం ముందు వైపు 270ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఎఫ్ఐ4వి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అపాచే శ్రేణిలోని టాప్ లైన్ మోడల్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందించింది. హార్డ్ కోర్ అపాచే ఆర్‌టిఆర్ అభిమానులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. విపణిలో ఉన్న బజాజ్ ఎన్ఎస్200 మోటార్ సైకిల్‌తో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS Apache 200 Fi4V Launched At Rs 1.07 Lakh In India
Story first published: Monday, November 6, 2017, 19:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X