టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైక్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, పోటోలు, బుకింగ్స్ మరియు డెలివరీలు

Written By:

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త అపాచే ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైకును లాంచ్ చేసింది. మార్కెట్ దిగ్గజాలకు షాక్ ఇస్తూ తమ పూర్తి స్థాయి స్పోర్ట్ బైకు అపాచే ఆర్ఆర్ 310 ధర రూ. 2.05 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా అపాచే ఆర్ఆర్ 310 మోటార్ సైకిల్‌ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టీవీఎస్ అకులా పేరుతో కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించింది. స్పోర్ట్స్, కమ్యూటర్, రోజూ వారి అవసరాలు ఉపయోగించుకునేలా ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ టూరింగ్ బైకు రేస్ ట్రాక్‌ల మీద కూడా పరుగులు పెడుతుంది.

Recommended Video - Watch Now!
TVS Apache RR 310 Launched In India | FirstLook |Top-speed | Price - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకును బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ భాగస్వామ్యంతో హోసూర్‌లోని తమ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. దీని మీద డిసెంబర్ 2017 నుండి దేశ్యాప్తంగా ఉన్న టీవీఎస్ విక్రయ కేంద్రాలలో బుకింగ్స్ ప్రారంభించి. 2018 ప్రారంభం నుండి డెలివరీలను స్టార్ట్ చేయనుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కేవలం 7.17 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు 0 - 60కిమీల వేగాన్ని 2.9 సెకండ్లలోనే చేరుకుంటుంది. అపాచే ఆర్ఆర్ 310 గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

ఆపాచే ఆర్ఆర్ 310 బైకులో ముందువైపున 110/70-17 మరియు వెనుకవైపున 150/60-17 కొలతల్లో ఉన్న మిచేలియన్ పైలట్ స్ట్రీట్ రేడియల్ టైర్లు ఉన్నాయి. మరియు బైకు మొత్తం బరువు 169.5 కిలోలుగా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 డిజైన్

షార్క్ చేప ప్రేరణతో టీవీఎస్ దీనిని అభివృద్ది చేసింది. అగ్రెసివ్ స్టైలింగ్, పొడవాటి స్వింగ్ ఆర్మ్ మరియు అత్యుత్తమ హ్యాండ్లింగ్ దీని ప్రత్యేకతలు. ఫ్రంట్ డిజైన్‌లో డ్యూయల్ ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విభిన్నంగా ఉన్నాయి. అదే విధంగా రియర్ డిజైన్‌లో డెవిల్ హార్న్ ఆకారంలో ఉన్న స్పోర్టివ్ ఎల్ఇడి టెయిల్ లైట్లు కలవు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

ఆపాచే ఆర్ఆర్ 310లో మిగతా అన్ని బైకుల్లో వచ్చే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లకు భిన్నంగా ఉంది. పొడవాటి మల్టీ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే ఉంది. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, రేసింగ్ రెడ్ మరియు సినిస్టర్ బ్లాక్.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

అపాచే ఆర్ఆర్ బైకును డిటాచబుల్ రియర్ సబ్ ఫ్రేమ్ గల ట్యూబులర్ స్టీల్ బ్రిడ్జి టైప్ ఫ్రేమ్ మీద నిర్మించింది. సస్పెన్షన్ కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రేడియల్‌గా మౌంట్ చేయబడిన నాలుగు పిస్టన్ల ఫిక్స్‌డ్ కాలిపర్ గల 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ గల 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకులో బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ది చేసిన 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ సింక్రోమెష్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 9,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 34బిహెచ్‌పి పవర్ మరియు 7500ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైకు ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో తీవ్ర అలజడిని సృష్టించనుంది. దీని ఎక్ట్సీరియర్ మరియు ఇంజన్ పరంగా చూస్తే, విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి 390, నింజా 300, బెనెల్లీ 302ఆర్ మరియు బజాజ్ డామినర్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: TVS Apache RR 310 Launched In India At Rs 2.05 Lakh: Bookings To Begin Soon & Deliveries By December

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark