మ్యాట్ రెడ్ పెయింట్ స్కీములో విడుదలైన RTR సిరీస్ బైకులు

Written By:

టీవీఎస్ మోటార్స్ అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు అపాచే ఆర్‌టిఆర్ 180 బైకులను సరికొత్త మ్యాట్ రెడ్ కలర్ వేరియంట్లో విడుదల చేసింది. టీవీఎస్ లైనప్‌లోని అపాచే ఆర్‌టిఆర్ సిరీస్‌లో గల రెండు బైకుల్లో ఈ సరికొత్త కలర్ ఆప్షన్‌ జోడించినట్లు టీవీఎస్ తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

టీవీఎస్ అపాచే సిరీస్ మ్యాట్ రెడ్ ఎడిషన్ ధరలు

  • అపాచే ఆర్‌టిఆర్ 160 ధర రూ. 77,865 లు
  • అపాచే ఆర్‌టిఆర్ 160 ఆర్‌డి (రియర్ డిస్క్) ధర రూ. 80,194 లు
  • అపాచే ఆర్‌టిఆర్ 180 ధర రూ. 81,833 లు.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

నూతన పెయింట్ స్కీములో విడుదలైన అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు 180 బైకుల మీద మ్యాట్ రెడ్ పెయింట్ ఫినిషింగ్ చేయబడింది. టీవీఎస్ లైనప్‌లో ఉన్న అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో ఈ కలర్ ఆప్షన్‌ ఇది వరకే పరిచయం అయ్యింది. అంతే కాకుండా, ఈ బైకుల్లో రిమ్ స్టిక్కర్లు ఉన్నాయి.

Recommended Video
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

కాస్మొటిక్ మార్పలు మినహాయిస్తే, టెక్నికల్‌గా ఈ బైకుల్లో ఎలాంటి మార్పలు చోటు చేసుకోలేదు. అయితే, టీవీఎస్ అపాచే 180 లోని ఏబిఎస్ వేరియంట్‌ ఈ నూతన పెయింట్ స్కీమ్ పొందలేదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

అపాచే ఆర్‌టిఆర్ 160 బైకులో 15.2బిహెచ్‌పి పవర్ మరియు 13.1ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 159.7సీసీ సామర్థ్యం గల సింగల్ ఇంజన్ కలదు, మరియు అపాచే ఆర్‌టిఆర్ 180 బైకులో 15.5బిహెచ్‌పి పవర్ మరియు 17.03ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 177.4సీసీ ఇంజన్ కలదు. రెండు బైకుల్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

రెండు బైకుల్లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ గ్యాస్ మిగ్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. రెండింటిలో ముందు వైపున 270ఎమ్ఎమ్ చుట్టు కొలతలో ఉన్న పెటల్ డిస్క్ మరియు వెనుక వైపున 200ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అపాచే ఆర్‌టిఆర్ 160 బైకు 130ఎమ్ఎమ్ రియర్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ కలర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్స్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అపాచే సిరీస్ బైకుల్లో సరికొత్త మ్యాట్ రెడ్ ఫినిష్ పెయింట్ స్కీమ్‌ను పరిచయం చేసింది. టీవీఎస్ అతి త్వరలో పూర్తి స్థాయిలో తొలి స్పోర్ట్స్ బైకు అపాచే ఆర్ఆర్ 310ఎస్ ను విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: TVS Apache RTR 160 And 180 Matte Red Variant Launched In India; Prices Start At Rs 77,865
Story first published: Thursday, September 21, 2017, 17:35 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark