టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల: ధర, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు కోసం....

Written By:

టీవీఎస్ టూ వీలర్స్ ఇండియన్ స్కూటర్ల విపణిలోకి క్లాసిక్ జూపిటర్ స్కూటర్‌ను విడుదల చేసింది. టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ ప్రారంభ ధర రూ. 55,266 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, మరియు పూర్తి విడుదల వివరాలు నేటి కథనంలో...

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

సరికొత్త టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌లో 109.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 8.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ సెగ్మెంట్లోనే అత్యధిక మైలేజ్ లీటర్‌కు 62కిమీలు ఇవ్వగలదు.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

టీవీఎస్ తమ రెగ్యులర్ వెర్షన్ జూపిటర్‌ను పురాతణ స్కూటర్ స్టైల్లో రూపొందించి క్లాసిక్ పేరుతో విడుదల చేసింది. ఇందులో ముందు వైపున విండ్ షీల్డ్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న క్రోమ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

జూపిటర్‌లో జరిగిన ఇతర మార్పులు గమనిస్తే, ఎక్ట్సీరియర్ మీద అధికంగా అందించిన క్రోమ్ పార్ట్స్, రియర్ ప్యాసింజర్ కోసం బ్యాక్ రెస్ట్, మరియు డ్యూయల్ టోన్ సీట్ కలదు.

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

జూపిటర్ క్లాసిక్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పాత స్టైల్లోనే అందివ్వడం జరిగింది. ఆధుకంగా వినియోగించే డిజిటల్ మీటర్లకు బదులుగా డయల్ తరహా మీటర్లను టీవీఎస్ ఇందులో అందించింది.

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

టీవీఎస్ రెగ్యులర్ జూపిటర్ టాప్ ఎండ్ వేరియంట్ జడ్ఎక్స్ వెర్షన్‌లో ఉన్న 220ఎమ్ఎమ్ చుట్టుకొలత గల ఫ్రంట్ డిస్క్ బ్రేకును జూపిటర్ క్లాసిక్ ఫ్రంట్‌ వీల్‌కు అందివ్వడం జరిగింది.

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్ ప్రస్తుతం విపణిలో ఉన్న హోండా ఆక్టివా, హీరో మాయెస్ట్రో, సుజుకి యాక్సెస్ మరియు యమహా ఫ్యాసినో వంటి స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

టీవీస్ జూపిటర్ క్లాసిక్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కూటర్ల మార్కెట్లో ఇప్పటి వరకు పాత కాలం నాటి డిజైన్ శైలిలో లభించే స్కూటర్ ఒక్కటి కూడా లేదు, ఈ సెగ్మెంట్లో టీవీఎస్ తమ జూపిటర్ క్లాసిక్ ద్వారా ఆరంగ్రేటం చేసింది. జూపిటర్ సిరీస్‌లో లభించే రెగ్యులర్ వెర్షన్ వద్దుకునే వారికి క్లాసిక్ వేరియంట్ సరైన ఎంపిక కానుంది.

English summary
Read In Telugu: TVS Jupiter Classic Launched In India-Launch Price Mileage Specifications Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark