బిఎస్‌-IV స్కూటీ జెస్ట్ 110 విడుదల చేసిన టీవీఎస్: ధర రూ. 48,038 లు

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ బిఎస్-IV స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. నాలుగు నూతన కలర్ ఆప్షన్‌లతో పాటు బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అందించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

బిఎస్-IV టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌ ధర రూ. 48,038 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. మరియు ఇది నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది.

  • మ్యాట్ బ్లూ,
  • మ్యాట్ రెడ్,
  • మ్యాట్ యెల్లో మరియు
  • మ్యాట్ బ్లాక్ వీటితో పాటు మునుపు ఉన్న రంగులతో యథావిధిగా ఎంచుకోవచ్చు.
బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

సాంకేతికంగా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌లో 110సీసీ సామర్థ్యం గల సివిటిఐ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 7.9బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

టీవీఎస్ తెలిపిన వివరాల మేరకు స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ లీటర్‌కు 652కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల స్కూటర్ ఇదే అని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్ల వద్ద బిఎస్-IV స్కూటీ జెస్ట్ 110 అందుబాటులో ఉంది.

బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

నూతన బిఎస్-IV స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌లో సరికొత్త 3డీ లోగో, అండర్ సీట్ స్టోరేజ్ లైట్, డ్యూయల్ టోన్ సీట్ కలర్స్ సిల్వర్ మరియు ఇంటీరియర్ ప్యానెల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో పాటు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను స్కూటీ జెస్ట్ 110 లో అందివ్వడం జరిగింది.

బిఎస్-IV ఇంజన్‌తో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 విడుదల

స్టాండర్డ్ వేరియంట్లలో మునుపు ఉన్నకలర్ ఆప్షన్స్ టార్‌క్వైస్ బ్లూ, పర్ల్ పీచ్, పవర్ ఫుల్ పింక్ మరియు సిట్రస్ ఆరేంజ్ లతో పాటు కొత్త రంగులతో కలుపుకుని మొత్తం ఏనిమిది రంగుల్లో స్కూటీ జెస్ట్ 110 ను ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu TVS Scooty Zest 110 With BSIV Engine Launched In India. Get more details about TVS Scooty Zest 110 With BSIV Engine price, mileage, feature, colours and photos
Story first published: Monday, May 22, 2017, 17:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark