ట్వంటీ టూ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అభివృద్ది చేస్తున్న అంకుర సంస్థ

Written By:

ట్వంటీ టూ వినడానికి ఇదొక నెంబర్. కానీ ఇది ఒక కంపెనీ పేరు. ఆశ్చర్యంగా ఉంది కదూ... మేము కూడా మొదట్లో ఏ రెస్టారెంట్ పేరో... లేదంటే మంచి స్టార్ హోటల్ అయ్యుండొచ్చని అనుకున్నాం. కానీ ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్ల అంకుర సంస్థ(స్టార్టప్).

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ట్వింటీ టూ స్మార్ట్ స్కూటర్ల పేరుతో 2016లో అంకుర సంస్థగా ఊపిరిపోసుకుంది. ట్వింటీ టూ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ల అభివృద్ది మరియు తయారీ లక్ష్యంతో ఏర్పడింది.

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఫ్యూచర్‌ ట్రాన్స్‌పోర్ట్ మీద దృష్టి సారించి అత్యాధునిక విద్యుత్ స్కూటర్లను అభివృద్ది చేస్తోంది. ట్వింటీ టూ ఎలక్ట్రిక్ స్మార్ట్ టూ వీలర్ల స్టార్టప్ తాజాగా ఫ్లో అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ట్వంటీ టూ ఫ్లో స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా నడిచే డిసి మోటార్ కలదు. ఒక్కసారి ఛార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

రెండు గంటల సమయంలో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇద్దరు పెద్దలు కూర్చునే సామర్థ్యం గల ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60కిలోమీటర్లుగా ఉంది. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయల్ బ్యాటరీలా కూడా పనిచేస్తోంది.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ స్కూటర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు డిస్క్ బ్రేక్ గల ఫ్రంట్ వీల్ ఉన్నాయి మరియు రెండు హెల్మెట్‌ పట్టేటంత స్టోరేజ్ స్పేస్ అందివ్వడం జరిగింది.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

రైడర్ స్కూటర్‌ గురించిన మొత్తం సమచారాన్ని పొందేందుకు టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ డిస్ల్పే కలదు. ఇది స్కూటర్‌కు సంభందించిన డాటాను భద్రత పరుస్తుంది. స్కూటర్‌లో గల ఇన్ బిల్ట్ జియో ఫెన్సింగ్ ద్వారా దొంగలు స్కూటర్‌ను తీసుకెళితే రిమోట్ వెహికల్ ట్రాకింగ్ చేయవచ్చు.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

అంతే కాకుండా స్కూటర్‌ నిర్దేశిత సరిహద్దు దాటిపోతే, అది ఏ మాత్రం పనిచేయకుండా స్మార్ట్ యాప్ ద్వారా స్కూటర్ ఓనర్ పూర్తిగా ఆపేయవచ్చు. దీంతో దొంగల బెడద అస్సలు ఉండదు.

ట్వంటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ట్వంటీ టూ ఫ్లో స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు సుమారుగా 85 కిలోల వరకు ఉంటుంది. మరియు ఈ స్కూటర్ వెల రూ. 65,000 నుండి రూ. 75,000 ల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Twenty two flow electric scooter unveiled in india
Story first published: Friday, November 3, 2017, 16:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark