కొత్త కలర్ ఆప్షన్స్‌లో డీలర్లను చేరిన బజాజ్ డామినర్ 400

Written By:

బజాజ్ ఆటో 2018 వెర్షన్ డామినర్ ఫ్లాగ్‌షిప్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. కాస్మొటిక్ మార్పులకు గురైన డామినర్ 400ను అతి త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, బజాజ్ డామినర్ 400 రెండు కొత్త కలర్ ఆప్షన్లలో డీలర్ల వద్దకు చేరినట్లు తెలిసింది.

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

బజాజ్ 2018 డామినర్ 400 బైకును గ్లోజీ రెడ్ మరియు ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో పరిచయం చేస్తోంది. ఇవి, కాకుండా అదనంగా డామినర్ 400 బైకులో గోల్డెన్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎక్ట్సీరియర్ సొబగులు స్పోర్ట్స్ క్రూయిజర్ బైక్‌కు మరింత ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

2018 బజాజ్ డామినర్ 400 బైకులో బ్లాక్ ఇంజన్ కేసింగ్, పెరిమీటర్ ఫ్రేమ్ మరియు ఫుట్ పెడల్స్ అసెంబ్లీ ఉన్నాయి. వీటిని మినహాయిస్తే, మిగతా అన్ని డిజైన్ అంశాల మునుపటి వెర్షన్‌నే పోలి ఉంటాయి.

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

డామినర్ 400 బైకులో కెటిఎమ్ నుండి సేకరిస్తున్న అదే 373సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్లిప్పర్ క్లచ్ సహాయంతో రియర్ వీల్ లాక్ అవ్వకుండా గేర్లను మృదువుగా మార్చే 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఇందులో కలదు.

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

డామినర్ 400లో ప్రీమియమ్ ఫీచర్లు అయిన ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ ట్యాంక్ మీద అదనంగా మరో ఎల్‌సిడి డిస్ల్పే, డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఏబిఎస్ లేని డామినర్ 400 వేరియంట్‌ను తక్కువ ధరతో విక్రయిస్తోంది.

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

పోటిని ఎదుర్కొనేందుకు డామినర్ 400 ధరను బజాజ్ చాలా తెలివిగా నిర్ణయించింది. ఇందులో ముందువైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రి-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు: ఇక మీదట ఆ సౌండ్ లేనట్లేనా..?

2018 మారుతి స్విఫ్ట్ ధరలు వచ్చేశాయ్!!

రోజురోజుకూ ముదురుతున్న యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. దేశీయంగా జరిపే సేల్స్ కంటే ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ క్రూయిజర్ బైకు మీద ఆశించిన ఆదరణ లభించలేదు. ప్రారంభంలో నెలకు 10,000 బైకులను విక్రయించే లక్ష్యంతో ఉన్న బజాజ్‌కు ఇప్పుడది సాధ్యం కాలేదు.

బజాజ్ డామినర్ 400 కలర్ ఆప్షన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డామినర్ 400 బజాజ్ సంస్థను పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి తీసుకొచ్చింది. ధరకు తగ్గ విలువలతో ఎన్నో రకాల ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో డామినర్ వచ్చింది. భారత్‌లో తాను అనుకున్న సేల్స్ సాధించేందుకు డామినర్ 400 బైకులో కొన్ని మార్పులు మరియు కొత్త రంగులు జోడింపుతో రీలాంచ్ చేసేందుకు సిద్దమైంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Image Source: TeamBHP

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: 2018 Bajaj Dominar 400 Spotted At Dealership — Gets Two New Colours

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark