బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త అవెంజర్ స్ట్రీట్ 180 క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. సరికొత బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 ప్రారంభ వేరియంట్ ధర రూ. 83,475 లు

By Anil

Recommended Video

Honda XBlade First Look Walkaround, Specs, Details, Features - DriveSpark

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త అవెంజర్ స్ట్రీట్ 180 క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. సరికొత బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 ప్రారంభ వేరియంట్ ధర రూ. 83,475 లు ఎక్స్-షోరూమ్(మహారాష్ట్ర)గా ఉన్నట్లు బజాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

స్ట్రీట్ 180 విడుదలతో అవెంజర్ సిరీస్‌లోకి 180సీసీ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ ప్రవేశించింది. తొలుత 2015లో ప్రకటించిన బజాజ్ ఎట్టకేలకు అవెంజర్ లైనప్‌లోకి విడుదలయ్యింది. ఈ సరికొత్త క్రూయిజర్ స్ట్రీట్ 150 స్థానాన్ని భర్తీ చేసింది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

సాంకేతికంగా సరికొత్త బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 బైకులో 178.6సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది, 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 15.3బిహెచ్‌పి పవర్ మరియు 6,500ఆర్‌పిఎమ్ వద్ద 13.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

అవెంజర్ స్ట్రీట్ 180 లోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. 150కిలోలు బరువు ఉన్న అవెంజర్ స్ట్రీట్ 180లో 13-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

అవెంజర్ లైనప్‌లో ఉన్న స్ట్రీట్ 220 నుండి సేకరించిన టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లను స్ట్రీట్ 180లో అందివ్వడం జరిగింది. అంతే కాకుండా స్ట్రీట్ 220లో ఉన్న అవే 260ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ మరియు 130ఎమ్ఎమ్ రియర్ డ్రమ్ బ్రేకులు స్ట్రీట్ 180లో ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

అవెంజర్ స్ట్రీట్ 180 క్రూయిజర్ బైకులో ఇరువైపులా 17-అంగుళాల అళ్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటిలో ఫ్రంట్ వీల్‍‌కు 90/70 మరియు రియర్ వీల్‌కు 13/90 కొలతల్లో ఉన్న ఎమ్ఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. అయితే, సేఫ్టీలో అతి ముఖ్యమైన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఇందులో మిస్సయ్యింది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

అవెంజర్ స్ట్రీట్ 180 డిజైన్ విషయానికి వస్తే, స్టైలింగ్ మరియు మెకానికల్ పరంగా ఎన్నో విడి భాగాలను స్ట్రీట్ 220 నుండి సేకరించి ఇందులో అందించినట్లు స్పష్టంగా గుర్తించవచ్చు.

పగటి పూట వెలిగే ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, హెడ్‌ల్యాంప్ మీద చిన్న పరిమాణంలో ఉన్న బ్లాక్ కౌల్, బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్, సస్పెన్షన్, సైడ్ ప్యానల్స్, ఇంజన్, మరియు ఎగ్జాస్ట్ ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

సరికొత్త బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180 క్రూయిజర్ మోటార్ సైకిల్ రెండు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, ఎబోనీ బ్లాక్ మరియు స్పైసీ రెడ్. వీటికో తోడు గ్లోజీ పెయింట్ స్కీమ్స్‌కు ఆకర్షణీయంగా అధునాతన బాడీ గ్రాఫిక్స్ మరియు రీడిజైన్ చేయబడిన పొడవాటి సీట్ ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో ఎట్టకేలకు తమ 180 సీసీ ఇంజన్‌కు అవెంజర్ స్ట్రీట్ 180 విడుదలతో మళ్లీ తీసుకొచ్చింది. సరికొత్త ఇంజన్ మరియు స్ట్రీట్ 220 నుండి సేకరించిన డిజైన్ అంశాలతో స్ట్రీట్ 180 చూడటానికి చక్కగా ఉంది.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180

బజాజ్ స్ట్రీట్ 180 ధర స్ట్రీట్ 150 మోడల్‌తో పోల్చుకుంటే రూ. 3,000 లు మాత్రమే అధికంగా ఉంది. సుజుకి ఇంట్రూడర్‌లో 150సీసీ ఇంజన్ ఉంది. అంతే కాకుండా అవెంజర్ స్ట్రీట్ 180తో పోల్చుకుంటే ఇంట్రూడర్ 150 ధర రూ. 12,000 ల వరకు ఎక్కువగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Avenger Street 180 Launched At Rs 83,475 - Specifications, Features & Colours
Story first published: Thursday, February 22, 2018, 17:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X